ఎన్టీఆర్ - పూరిల కాంబోలో వచ్చిన ‘టెంపర్’ చిత్రాన్ని హిందీ మరియు తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతుంది. ఇక తమిళంలో ఈ రీమేక్ ను అయోద్య టైటిల్ తో విశాల్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను విళిపురం జిల్లా - కూనిపాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. షూటింగ్ లో భాగంగా వినాయకుడి పూజా కార్యక్రమాలు నిర్వహించే సీన్స్ ను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్లాన్ చేశాడు. షూటింగ్ కు మొత్తం ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత అక్కడకు ముస్లీంలు వచ్చి షూటింగ్ ను అడ్డుకున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేసిన సందర్బంగా ముస్లీంలు బ్లాక్ డేను నిర్వహిస్తారు. ఆ రోజు మసీదుకు పక్కనే వినాయకుడి పూజ ఏంటీ అంటూ చిత్ర యూనిట్ సభ్యులపై ముస్లీంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనిట్ సభ్యులు చిత్రీకరణ నిలిపేయకుండా అలాగే చేసిన నేపథ్యంలో ముస్లీంలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అయోద్య చిత్ర యూనిట్ సభ్యులతో మాట్లాడి షూటింగ్ ను ఆపేయించారు.
ముందుగా అనుమతి తీసుకోక పోవడంతో పాటు - బ్లాక్ డే రోజున మసీదు పక్కన వినాయకుడి పూజ చిత్రీకరణ జరిపితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని - అందుకే వెంటనే చిత్రీకరణ నిలిపేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో తప్పక షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. షూటింగ్ కోసం చెన్నై నుండి రోడ్డు మార్గంలో బయలు జేరిన విశాల్ షూటింగ్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసి మద్యలోనే వెనుదిరిగాడు. ఆ రోజు షెడ్యూల్ క్యాన్సిల్ అయినా ఆ తర్వాత మళ్లీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.