టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై విశాల్ ఏమన్నాడంటే..

Update: 2018-04-19 15:30 GMT
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గొడవ తెలుగు రాష్ట్రాల హద్దుల్ని ఎప్పుడో దాటేసింది. శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన చేసినప్పుడే ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది వేరే ఇండస్ట్రీల్లో కూడా ఉన్న వ్యవహారమే కాబట్టి అప్పుడప్పడూ అక్కడ కూడా ఆరోపణలు.. విమర్శలు వస్తుంటాయ. ఐతే టాలీవుడ్లో జరుగుతున్నంత రచ్చ.. చర్చ మరెక్కడా ఇప్పటిదాకా జరగలేదన్నది వాస్తవం. గత నెలన్నర రోజులుగా తమిళ సినీ పరిశ్రమ సమ్మెలో కొనసాగుతుండగా.. అక్కడి సినీ ప్రముఖులంతా ఆ అంశం మీదే దృష్టిసారించారు. ముఖ్యంగా తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సంబంధింత విషయాల్లోనే తలమునకలై ఉన్నాడు. రెండు రోజుల కిందటే అక్కడ సమ్మెకు తెరపడింది. దీంతో విశాల్ మీడియా ముందుకొచ్చాడు.

ఈ నేపథ్యలో టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి జరుగుతున్న గొడవ గురించి అక్కడి మీడియా వాళ్లు అతడిని ప్రశ్నించారు. దీనికి అతను బదులిస్తూ.. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందని సింపుల్ గా అనేస్తే సరిపోదని.. రుజువు చేయాలని అన్నాడు. ఎవ్వరైనా కాస్టింగ్ కౌచ్ జరిగిందని ఆధారాలతో నిరూపించగలిగితే కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశాల్ అన్నాడు. కోలీవుడ్లో కూడా ఇంతకుముందు ఇలాంటి ఆరోపణలే వచ్చాయని.. వరలక్ష్మి.. అమలాపాల్ లాంటి వాళ్లు ఇబ్బంది పడి నడిగర్ సంఘాన్ని ఆశ్రయించారని.. వారికి తాము న్యాయం చేశామని విశాల్ వివరించాడు. ఐతే ఎవరో ఒకరిద్దరు చేసే నీచపు పనులను పరిశ్రమ మొత్తానికి అంటించవద్దని విశాల్ సూచించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.


Tags:    

Similar News