మేడ కట్టాకే పందెంకోడి మ్యారేజ్

Update: 2016-01-21 22:30 GMT
కోలీవుడ్ లో కథకళి ఆడేసి, టాలీవుడ్ ని కూడా ఆడించడానికి వస్తున్నాడు పందెంకోడి విశాల్. వరుసగా సూపర్ హిట్స్ కొట్టేస్తూ.. మంచి ఊపుమీదున్న ఈ నల్లనయ్యకి పెళ్లి బాజాలు ఇంకా మోగలేదు. పిల్ల రెడీగానే ఉంది కానీ.. ఇతగాడే పెళ్లికి ససేమిరా అంటున్నాడు. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని ఇతగాడు పెళ్లి చేసుకోవాల్సి ఉంది.

మ్యారేజ్ కి అమ్మాయి కూడా సిద్ధంగానే ఉంది కానీ.. ఈ కోలీవుడ్ స్టార్ మాత్రం మేడ కట్టాకే పెళ్లి చేస్కుంటానని చెబుతున్నాడు. జనవరి 22న కథకళి తెలుగు వెర్షన్ రిలీజ్ కానుండడంతో.. హైద్రాబాద్ వచ్చాడు విశాల్. ఈ సమయంలో విశాల్ ని విలేఖరులందరూ పెళ్లి గురించి ప్రశ్నలు గుప్పించారు. అఫ్పుడు విశాల్ చెప్పిన మాట అందరినీ ఆశ్చర్య పరిచింది. తను మేడ కట్టిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని, అప్పటివరకూ చేసుకునే సమస్యే లేదంటున్నాడు విశాల్.  ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనడం కరెక్టే కానీ.. ఇతగాడు కడతానంటున్నది తన ఇల్లు కాదు.

నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా ఇతనిచ్చిన వాగ్దానం ఏంటంటే.. తమ అసోసియేషన్ కి సొంత బిల్డింగ్ కట్టిస్తానని. ఆ తర్వాత జరిగిన పోలింగ్ లో విశాల్ గ్రూప్ గెలుపొందింది. విశాల్ ఆ సంఘానికి కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. అందుకే ఆ వాగ్దానం నెరవేర్చాకే తనుపెళ్లి చేసుకుంటానని తేల్చేస్తున్నాడు విశాల్. అయినా విశాల్.. బిల్డింగ్ కట్టాకే పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేయలేదు కదా.. మరి ఇంకెందుకు ఆలస్యం. తొందరగా చేసేస్కోరాదూ.. వరలక్ష్మి వెయిటింగ్ అక్కడ.
Tags:    

Similar News