పెళ్లి ఫిక్స్‌... ఇదేం ట్విస్ట్‌ విశాల్‌?

Update: 2019-01-11 10:21 GMT
తమిళ హీరో విశాల్‌ పెళ్లి గురించిన వార్తలు గత మూడు నాలుగు సంవత్సరాలుగా వస్తున్న విషయం తెల్సిందే. శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మితో ఈయన ప్రేమలో ఉన్నాడని, ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరి వ్యవహారం చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగానే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారేమో అని, పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకున్నారు. కాని విశాల్‌ మాత్రం వరలక్ష్మి స్నేహితురాలే అంటూ వచ్చాడు. అన్నట్లుగానే వరలక్ష్మిని కాకుండా హైదరాబాద్‌ కు చెందిన అమ్మాయి అనీషాను వివాహం చేసుకోబోతున్నాడు.

హైదరాబాద్‌ కు చెందిన విజయ్‌ రెడ్డి - పద్మల కూతురు అనీషా. వీరిద్ది పెద్దలు కుదిర్చిన వివాహంగా అంతా అనుకుంటున్నారు. కాని అనూహ్యంగా విశాల్‌ తన పెళ్లి గురించి మాట్లాడుతూ తమది ప్రేమ వివాహం అన్నాడు. విశాల్‌ హీరోయిన్‌ వరలక్ష్మితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి, కాని ఎప్పుడు కూడా బయటి అమ్మాయితో విశాల్‌ ప్రేమలో ఉన్నాడనే కనీసం పుకార్లు కూడా వినిపించలేదు. విశాల్‌ మాత్రం తాను చాలా సంవత్సరాలుగా అనీషాను ప్రేమిస్తున్నానని, మాది పెద్దలు ఒప్పుకున్న ప్రేమ వివాహం అన్నాడు.

ప్రస్తుతం విశాల్‌ - అనీషాల వివాహ నిశ్చితార్థంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే హైదరాబాద్‌ లో వివాహ నిశ్చితార్థం వైభవంగా జరుగబోతుంది. ఇక విశాల్‌ మొదటి నుండి చెబుతూ వస్తున్నట్లుగా నడిగర్‌ సంఘం భవనం పూర్తి అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంటూ ఇప్పుడు కూడా చెప్పుకొచ్చాడు. త్వరలోనే నడిగర్‌ సంఘం బిల్డింగ్‌ పూర్తి అవ్వనుందని, అందులోనే తాను వివాహం చేసుకుంటానంటూ పేర్కొన్నాడు.


Full View

Tags:    

Similar News