సినిమా హీరో అనిపించావయ్యా...

Update: 2015-06-29 09:30 GMT
తండ్రిని కాదనలేదు.. స్నేహితుడిని వద్దనలేదు! తనకి ఇద్దరూ ముఖ్యమే. ఎవరినీ వదులుకోలేదు. హర్ట్‌ చేయలేదు. కానీ సీన్‌ వేరేగా ఉందిక్కడ. ఎవరో ఒక్కరితోనే కుదిరే సన్నివేశం. ఇలాంటి సందర్భాన్ని మీరైతే ఎలా ఎదుర్కొంటారు? కానీ అలాంటి సన్నివేశాన్ని సమర్ధంగానే ఎదుర్కొంది కోలీవుడ్‌ హీరోయిన్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఈ యవ్వారంపై విశాల్‌ బాబు ఇచ్చిన రియాక్షన్‌ కూడా ఇంకా సూపరు.

తమిళనాట నడిగరసంఘం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది. ఈ శుభ సందర్భాన తనకి మాత్రమే కావాల్సిన ఇద్దరు సంఘం అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఎన్నికల వేళ ఇద్దరూ విరోధులై తిట్టుకుని కొట్టుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అందులో ఒకరు తనకి ఎంతో ఆప్త మిత్రుడైన విశాల్‌ నేరుగా తన తండ్రి శరత్‌కుమార్‌తోనే ఢీకొడుతున్నాడు. విశాల్‌ ఇటీవలే శరత్‌కుమార్‌ని ఓ రేంజులో తిట్టాడు. నడిగరసంఘంలో మార్పు తెచ్చి చూపిస్తానని సవాల్‌ విసిరాడు. ఈ సందర్భంలో నేను మా నాన్నకే సపోర్టు చేస్తున్నా అంటూ అమ్మడు ఓపెన్‌గానే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

అయితే వరలక్ష్మి ఇబ్బంది గురించి విశాల్‌ని అడిగితే.. ఓ కూతురిగా తండ్రికే ఓటేస్తానని వరలక్ష్మి చెప్పింది. అదే కరెక్ట్‌ కూడా. నేనైనా అదే చేసేవాడిని. వరలక్ష్మితో స్నేహం చెక్కు చెదరదు.. అంటూ స్పోర్టింగ్‌ స్పిరిట్‌ చూపించాడు. ఒక ప్రక్కన గాళ్‌ ఫ్రెండ్‌ మాటలు, మరో ప్రక్కన ఫైటింగ్‌.. ఏమైనా సినిమా హీరో అనిపించావయ్యా విశాల్‌ బాబూ...

Tags:    

Similar News