కన్నడ సూపర్ పునీత్ రాజ్ కుమార్ మృతి ఆయన అభిమానులకు తీరని లోటును మిగిల్చింది. అభిమానులు మెల్ల మెల్లగా ఆయన మృతి నుండి కోలుకుంటున్నా.. ఆయన సేవా కార్యక్రమాల ద్వారా జీవనం సాగిస్తున్న వారు.. ఆయన ఆశ్రమాల్లో ఉంటున్న వారు.. ఆయన ఏర్పాటు చేసిన స్కూల్స్ లో చదువుకుంటున్న వారిలో ఆందోళన కనిపిస్తుంది. పునీత్ మృతితో తమ జీవితాలు మళ్లీ రోడ్డు మీదకు పడతాయేమో అనే భయం వారిలో ఉంది. పునీత్ చనిపోయినా ఆయన కుటుంబ సభ్యులు ఆ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకటించారు. పైగా పునీత్ రాజ్ కుమార్ తాను మొదలు పెట్టిన సేవా కార్యక్రమాల కోసం ముందుగానే డబ్బును ఫిక్స్ డిపాజిట్ చేశాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాలను తాను కొనసాగిస్తానంటూ విశాల్ ప్రకటించిన విషయం తెల్సిందే. తన సొంత డబ్బును.. తాను కూడ బెట్టుకున్న డబ్బును పునీత్ రాజ్ కుమార్ నిర్వహించిన సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానంటూ పేర్కొన్నాడు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో విశాల్ ఆ మాటలు చెప్పిన విషయం తెల్సిందే. ఆ రోజు ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మరోసారి ఈ తమిళ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గడ్డ మీద నిల్చుని.. ఆయన సమాది సాక్షిగా చెప్పుకొచ్చారు.
తాజాగా బెంగళూరు వెళ్లి కంఠీరవ స్టూడియోలోని పునీత్ రాజ్ కుమార్ సమాదిని దర్శించుకుని ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ తో భేటీ అయిన విశాల్ పలు విషయాలను గురించి చర్చించారని తెలుస్తోంది. త్వరలోనే పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు జరిపుతానంటూ చెప్పుకొచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారం తాను ఖచ్చితంగా పునీత్ రాజ్ కుమార్ గారి సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానంటూ మరోసారి చెప్పుకొచ్చాడు.