విశాల్ ఇంట పెళ్లి బాజాలు

Update: 2016-11-24 09:30 GMT
కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లిపై ఇండస్ట్రీ జనాలు ఎదురుచూస్తూనే ఉన్నారు. శరత్ కుమార్ కూతురు వర లక్ష్మితో ప్రేమ వ్యవహారం.. పెళ్లిగా మారుతుందని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. నడిగర్ సంఘంకు సొంత బిల్డింగ్ కట్టడం పూర్తయిన తర్వాత.. అందులో జరిగే తొలి పెళ్లి తనదే అంటూ విశాల్ అప్పట్లో చేసిన అనౌన్స్ మెంట్ కూడా ఈ అంచనాలకు కారణమే. అయితే.. విశాల్ పెళ్లికి ఇంకా టైం రాలేదు కానీ.. ఇప్పుడు ఈ హీరో చెల్లెలి పెళ్లి జరగబోతోంది.

విశాల్ చెల్లెలు ఐశ్వర్య ప్రస్తుతం V-మ్యూజిక్ బ్యానర్ కు సంబంధించిన కార్యకలాపాలు చూసుకుంటోంది. ఈమె క్రితీష్ అనే కుర్రాడిని త్వరలో పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. వుమ్మిడి బంగారు కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ క్రితీష్. ఐశ్వర్య-క్రితీష్ లు కొంత కాలంగా ఉన్నారని.. ఇప్పుడా ప్రేమ ముదిరి పెళ్లి వరకూ వచ్చిందని తెలుస్తోంది. రెండు వైపులా కుటుంబాల నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో.. వీరి పెళ్లి మాటలు సాఫీగా నడిచిపోయినట్లు చెప్పుకుంటున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో విశాల్ చెల్లెలికి ఎంగేజ్మెంట్ చేయనున్నారట. పెళ్లి కూడా అదే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. సోదరి వివాహం సరే.. మరి విశాల్ కూడా ఆ శుభముహూర్తం ఎప్పుడో చెప్పేస్తే.. అభిమానులు కాసింత సంతోషిస్తారు కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News