శివ‌శంక‌ర్ మాస్టార్ ఫ్యామిలీకి మంచు విష్ణు భరోసా

Update: 2021-11-26 10:45 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుడుతూ యువ అధ్య‌క్షుడు మంచు విష్ణు ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఆర్టిస్టుల సంక్షేమం స‌హా ఇండ్ల నిర్మాణానికి రూప‌క‌ల్ప‌న‌లు చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మా సొంత భ‌వంతి నిర్మాణంపైనా మంచు విష్ణు త‌న మాట‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

అంతేకాదు ప‌రిశ్ర‌మ‌లో క‌ష్టంలో ఉన్న‌వారిని ఆదుకునేందుకు విష్ణు త‌న‌కు తానుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు కొరియోగ్రాఫ‌ర్ శివ‌శంక‌ర్ మాస్టార్ క‌రోనా భారిన ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉంద‌న్న స‌మాచారం అంద‌డంతో `మా` అధ్య‌క్షుడు విష్ణు స్పందించారు. ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలుస్తాన‌ని విష్ణు అన్నారు. శివ‌శంక‌ర్ మాస్టార్ చిన్న కుమారునికి ఫోన్ చేసి భ‌రోసానిచ్చార‌ని తెలిసింది. మాస్టార్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

ఆర్టిస్టుల‌కు 50శాతానికే ఆస్ప‌త్రి ఓపీ!

`మా` ఆర్టిస్టుల ఆరోగ్యంపైనా అధ్య‌క్షుడు విష్ణు దృష్టి సారించారు. అసోసియేష‌న్ స‌భ్యుల‌కు భ‌రోసానిస్తూ ప్ర‌ముఖ కార్పొరెట్ ఆస్ప‌త్రుల‌తో విష్ణు ఒప్పందం చేసుకున్నారు. అపోలో-ఏఐజీ-మెడిక‌వ‌ర్- కిమ్స్- స‌న్ షైన్ తో మా ఒప్పందం కుదిరింది. స‌ద‌రు ఆస్ప‌త్రుల్లో చికిత్స‌కు వెళితే.. ఓపీలో 50శాతం త‌గ్గింపు వ‌ర్తిస్తుంద‌ని.. అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ అందుబాటులో ఉంటుంద‌ని వెల్ల‌డించారు. ద‌శ‌ల వారీగా ఆర్టిస్టుల‌కు ఆరోగ్య ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించనున్నామ‌ని మంచు విష్ణు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.




Tags:    

Similar News