మంచు హీరో విష్ణు గత కొన్ని రోజులుగా జిన్నా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో ఒక పాట తెరకెక్కిస్తున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా విష్ణు కు ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో విష్ణు కాలికి గాయం అయ్యింది. కాలు కు అయిన గాయం నుండి కోలుకోవడానికి విష్ణు రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.
గత కొన్ని రోజులుగా జిన్నా సినిమా కోసం బ్రేక్ తీసుకోకుండా మంచు విష్ణు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సమయంలో ఆయనకు ప్రమాదం జరగడంతో యూనిట్ సభ్యులు మరియు మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాల్లో ఆయన పూర్తి ఆరోగ్యంగా మారుతాడని.. మళ్లీ షూటింగ్ లో పాల్గొనవచ్చు అంటూ డాక్టర్లు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.
ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను మంచు విష్ణు ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. మంచు మోహన్ బాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పూత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం రాజుకుంటుంది. సినిమా విడుదల సమయంకు టైటిల్ విషయంలో మరింతగా వివాదం పెరిగే అవకాశం ఉంది.
తెలుగు తో పాటు ఈ సినిమాను హిందీ.. తమిళంలో మరియు మలయాళంలో విడుదల చేయబోతున్నారు. మంచు విష్ణు గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఆయనకు ఈ సినిమా అయినా సక్సెస్ ను తెచ్చి పెట్టేనా అనేది చూడాలి.
షూటింగ్ లో మంచు విష్ణు రెండు వారాల్లో తిరిగి జాయిన్ అయ్యి బ్యాలెన్స్ షూట్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేసేలా మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం మంచు విష్ణు కూతుర్లు ఒక పాట పాడిన విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.