మంచు విష్ణు ఇటీవల సోషల్ మీడియాలో గాలి నాగేశ్వరరావు గా తెగ సందడి చేస్తున్న విషయం తెల్సిందే. సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ పూత్ తో కలిసి ఈయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.
గాలి నాగేశ్వరరావు పాత్ర లో మంచు విష్ణు నటిస్తున్నాడు. దాంతో సినిమాకు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని అది టైటిల్ కాదని కొత్త టైటిల్ ను ప్రకటించారు.
టైటిల్ ప్రకటించడం కోసం నాలుగున్నర నిమిషాల వీడియోను మంచు విష్ణు షేర్ చేశాడు. ఆ వీడియో లో చిత్ర యూనిట్ సభ్యులు అయిన రచయిత కోన వెంకట్ మరియు సినిమాటోగ్రఫర్.. డైరెక్టర్ ఇంకా సంగీత దర్శకులు ఒకొక్కరుగా చేరుతూ సరదాగా ముచ్చటించుకుంటూ సినిమా టైటిల్ ను రివీల్ చేయడం జరిగింది. వచ్చిన వారందరు కూడా మీరు మా ప్రెసిడెంట్ కదా మీరు సినిమా చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. సినిమాలు ఎందుకు చేయకూడదు అంటూ మంచు విష్ణు ఫ్రస్టేట్ అవుతూ చేసిన వీడియో ఫన్ ను జనరేట్ చేసింది. ఇక టైటిల్ ను రచయిత కోన వెంకట్ 'జిన్నా' అంటూ రివీల్ చేశాడు. జిన్నా అంటూ చెప్పగానే మంచు విష్ణు షాక్ అయ్యి ఇదేంటి పాకిస్తాన్ తో కనెక్షన్ అన్నట్లుగా కామెంట్స్ చేశాడు.
టైటిల్ నచ్చలేదు.. సినిమాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు కూడా నచ్చలేదు అన్నట్లుగా మంచు విష్ణు అంటాడు. గాలి నాగేశ్వరరావు నచ్చక పోవడం వల్లే ఈ ఆ పేరును షార్ట్ ఫామ్ గా మార్చుకుని 'జిన్నా' అని పిలిపించుకుంటూ ఉంటాడు. అదే సినిమా కథ అంటూ కోన చెప్పడంతో సంతృప్తి చెందినట్లుగా జిన్నా టైటిల్ బాగుందని వీడియోను ఎండ్ చేశారు.
ఇండియాకు జాతిపతి మహాత్మ గాంధీ ఎలాగో పాకిస్తాన్ కు జాతిపిత మహ్మద్ అలీ జిన్నా అలా అనే విషయం తెల్సిందే. పాకిస్తాన్ వారికి జిన్నా ఒక దేవుడు అన్నట్లుగా గౌరవిస్తారు. అందుకే ఇండియాలో జిన్నా పేరు ఎక్కువగా వినిపించదు. అలాంటి జిన్నా పదంను తన సినిమాకు టైటిల్ గా పెట్టుకోవడం అంటే ఖచ్చితంగా మంచు విష్ణు డేరింగ్ డెషిషన్ అనడంలో సందేహం లేదు.
Full View