ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో మాస్ కా దాస్ డేంజ‌ర్ స్టెప్!

Update: 2022-11-02 02:30 GMT
`అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన హీరో విశ్వ‌క్ సేన్‌. ఈ మూవీ త‌రువాత నాలుగైతు సినిమాలతో హీరోగా, `దాస్ కా ధ‌మ్కీ`తో హీరోగా, డైరెక్ట‌ర్ గా బిజీగా వున్నాడు. రీసెంట్ గా త‌మిళ హిట్ మూవీ `ఓ మై క‌డ‌వులే` ఆధారంగా రీమేక్ అయిన `ఓరి దేవుడా` మూవీలో న‌టించిన విష‌యం తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుని విశ్వ‌క్ సేన్ కు మ‌రో విజ‌యాన్ని అందించింది.

అయితే క‌న్న‌డ ఫిల్మ్ `కాంతార‌` రిలీజ్ వ‌ర‌కు మంచి టాక్ తో పాటు మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఆ త‌రువాత‌ ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేకపోయింది. ప్ర‌స్తుతం విశ్వ‌క్ సేన్ మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా వున్నాడు. అందులో విభిన్న‌మైన నేప‌థ్యంలో సాగే `గామీ` ఒక‌టి కాగా..విశ్వ‌క్ సేన్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌కత్వంలో రూపొందిస్తున్న `దాస్ కా ధ‌మ్కీ` మ‌రొక‌టి. ఈ రెండింటిలో `గామి` షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.  

ఇక `దాస్ కా ధ‌మ్కీ` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. మ‌రి కొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో వుండ‌గా విశ్వ‌క్ సేన్ తాజాగా కొత్త సినిమా అంగీక‌రించిన‌ట్టుగా తెలుస్తోంది. నందు హీరోగా `స‌వారీ` మూవీని రూపొందించిన సాహిత్ తో విశ్వ‌క్ సేన్ ఓ భారీ ప్ర‌యోగానికి తెర‌లేపుతున్న‌ట్టుగా తెలుస్తోంది. కాలేజీ నేప‌థ్యంలో సాగే క‌థ‌ని ఇటీవ‌ల సాహిత్ ..విశ్వ‌క్ సేన్ కు వినిపించాడ‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో ఈ మూవీని తానే స్వ‌యంగా నిర్మిస్తాన‌న‌ని చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది.

అయితే ఇక్క‌డే ఒ చిక్కొచ్చిప‌డింది. `స్టూడెంట్ ` అనే టైటిల్ ని ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన ఈ మూవీకి రూ. 25 కోట్ల మేర బ‌డ్జెట్ అవుతుంద‌ని చెబుతున్నారు. సాహిత్ చేసిన ఫ‌స్ట్ మూవీ `స‌వారీ` పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అలాంటి ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో 25 కోట్ల బ‌డ్జెట్ తో సినిమా అంటే మాస్ కా దాస్ డేంజ‌ర్ స్టెప్ వేస్తున్న‌ట్టేన‌ని ఇన్ సైడ్ టాక్ న‌డుస్తోంది. సాహిత్ తొలి సినిమా ఆడ‌క‌పోయినా మంచి టెక్నీషియ‌న్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబ‌ట్టి అతనితో విశ్వ‌క్ సేన్ ఈ మూవీ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News