100 కోట్లు ఇచ్చినా చేయనని వాళ్ల మాటలకు కన్విన్స్ అవుతాడా..?

Update: 2022-11-06 09:50 GMT
యువ హీరో విశ్వక్ సేన్ సీనియర్ యాక్టర్ కమ్ డైరక్టర్ అర్జున్ ల మధ్య చిన్న డిస్టబన్స్ ఏర్పడింది. అర్జున్ డైరక్షన్ లో విశ్వక్ సేన్ ఓ సినిమా చేయాలని అనుకున్నారు. భారీ స్థాయిలో ఓపెనింగ్ ముహుర్తం జరిగింది. పూజా కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. అంతా బాగానే జరుగుతుంది అనుకునే టైం లో సడెన్ గా అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. విశ్వక్ సేన్ తన సినిమాకు డేట్స్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నాడని. అతన్ని నమ్మి షూటింగ్ పెట్టుకుంటే సడెన్ గా సినిమా నుంచి తప్పుకున్నాడని చెప్పారు అర్జున్.

అర్జున్ వర్షన్ కి విశ్వక్ సేన్ కూడా ఆయన చెప్పిన మాట తప్ప మిగతా వారికి రెస్పెక్ట్ లేదని. హీరోగా తనకి రెస్పెక్ట్ లేని చోట తాను చేయదలచుకోలేదని విశ్వక్ అన్నారు. అందుకే సినిమా నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. ఈ గొడవపై విశ్వక్ సేన్ గురించి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేస్తానని అన్నారు అర్జున్. విశ్వక్ సేన్ వల్ల తన ప్రొడక్షన్ కాస్ట్.. యూనిట్ శ్రమ వృధా అయ్యిందని చెప్పుకొచ్చారు.

అర్జున్ వర్సెస్ విశ్వక్ సేన్ వివాదం ప్రస్తుతం నిర్మాతల మండలి దగ్గర ఉంది. అయితే వారు ఈ ఇద్దరిని కలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారట. విశ్వక్ అప్ కమింగ్ హీరో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అతని గురించి ఇలా నెగటివ్ గా స్ప్రెడ్ అవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారట. తాను ఈ సినిమా డబ్బు కోసం తీయట్లేదని కూతురు ఐశ్వర్యని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఓ మంచి సినిమా చేయాలని అనుకున్నానని అన్నారు. 100 కోట్లు ఇచ్చినా సరే మళ్లీ విశ్వక్ సేన్ తో కలిసి పనిచేసేది లేదని తేల్చి చెప్పేశారు.

అర్జున్ అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మళ్లీ ఆయన్ని విశ్వక్ సేన్ తో సినిమా చేయించేలా నిర్మాతల మండలి ఒప్పిస్తుందా.. వారి బుజ్జగింపులకు అర్జున్ కన్విన్స్ అవుతాడా అన్నది చూడాలి. అర్జున్ తన మీద చేసిన అలిగేషన్స్ పై విశ్వక్ ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ ఈరోజు సాయంత్రం ఓ ట్రైలర్ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నాడు. అక్కడ అర్జున్ కామెంట్స్ కి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. అసలే మనోడు మైక్ పట్టుకుంటే వీరంగం ఆడేస్తాడు. హీరో అర్జున్ కామెంట్స్ పై విశ్వక్ సేన్ ఎలా స్పందిస్తాడు.. మీడియా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెబుతాడు అన్నది చూడాలి.
Tags:    

Similar News