విశ్వక్ సేన్ చూడటానికి ఎర్రగా బుర్రగా ఉంటాడు .. ఆయన ఎంచుకునే కథలు చూస్తే, యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంతవరకూ చేసింది కొన్ని సినిమాలే అయినా, తనదైన ప్రత్యేకమైన నటనతో ఆకట్టుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'పాగల్' కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తన క్రేజ్ ను మరింత పెంచుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
"నేను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాననీ, అందువలన అవకాశాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటానని నా గురించి రాసినవి చదువుతూనే ఉంటాను. కానీ అలాంటిదేం లేదు .. అందరూ నాతో మంచిగానే ట్రావెల్ అవుతున్నారు. కాకపోతే కొంచెం కోపం ఉంది .. కోపం వచ్చినప్పుడు మాత్రం సెల్ ఫోన్లు పగలగొట్టేస్తూ ఉంటాను. ఈ సారి నుంచి కూల్ గా ఉండాలనే అనుకుంటాను .. కానీ మళ్లీ మామూలే. మొన్న ఫోన్ పగలగొట్టిన తరువాత మాత్రం చాలా బాధపడ్డాను.
నేను ఏం చేసినా 'సూపర్ మామా' అంటూ భజన చేసేవాళ్లు నా పక్కన ఉండకూడదనే కోరుకుంటాను. నిన్న మొన్నటి వరకూ మన పక్కనే ఉన్నాడు .. వీడు హీరో ఏంట్రా అనే వాళ్లు పక్కన ఉన్నప్పుడే కళ్లు నెత్తికెక్కకుండా ఉంటాయి. హీరోగానే కాదు .. విలన్ రోల్ చేయడానికి కూడా నేను సిద్ధమే. ఒక కొత్త హీరో సినిమాలో అదిరిపోయే విలన్ రోల్ ఉన్నా చేస్తాను .. కథ నచ్చాలంతే. కథ .. కథలో నా పాత్రను గురించి మాత్రమే ఆలోచిస్తాను. పారితోషికం అనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ చివర్లోనే ఉంచుతాను" అని చెప్పుకొచ్చాడు.