ఏదో విధంగా మీడియాలో ఫోకస్ అవ్వాలనుకునే వారు ఎక్కువగా సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ ఉంటారు. తాజాగా చెన్నైకి చెందిన విశ్వ దర్శిని అనే మహిళ మీడియాలో ఫోకస్ అయ్యేందుకు విశాల్ పై సంచలన ఆరోపణలు చేసి - చివరకు ఆమె చిక్కుల్లో పడినది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై గోపాలపురంలో ఉండే విశ్వ దర్శిని తాజాగా సోషల్ మీడియాలో.. హీరో విశాల్ ఒక రోజు రాత్రి సమయంలో మా పక్క ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విశాల్ గోడ దూకి లోపలికి వెళ్లాడు. మూడు గంటల పాటు ఆ ఇంట్లోనే ఉన్న విశాల్ ఆ తర్వాత మళ్లీ గోడ దూకి బయటకు వెళ్లాడు, ఆ ఇంట్లో ఉండే 16 ఏళ్ల అమ్మాయితో విశాల్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ ఒక సీసీ టీవీ ఫుటేజ్ ను విడుదల చేసింది.
ఆ సీసీ టీవీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి విశాల్ అంటూ ఆమె చెబుతున్నా కూడా, అందులో కనిపిస్తున్నది విశాల్ కాదని ఎక్కువ శాతం మంది చెబుతున్నారు. విశ్వ దర్శిని విమర్శలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న ఈ సమయంలో పక్కింటి 16 ఏళ్ల అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. తనపై విశ్వ దర్శిని తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను ఆమెను వెంటనే శిక్షించాలంటూ ఆ అమ్మాయి కోరిందట.
కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వ దర్శినిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనిపించకుండా పోయిన విశ్వ దర్శినిని ట్రేస్ చేసేందుకు చెన్నై పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారట. పోలీసులకు అందిన ప్రాధమిక సమాచారం ప్రకారం ఆమె పబ్లిసిటీ కోసం ఇలా చేసిందట. ఆమె పట్టుబడితే పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.