వైవా హర్ష.. యుట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. అయితే ఈ పేరు టాలీవుడ్‌లో వేగంగా పాపులర్ అయిపోవడం ఖాయమని అంటున్నారంతా. హర్ష ఇప్పటికే చాలా సినిమాల్లో నటించినా ఆశించినంత గుర్తింపు రాలేదు. అడపా దడపా క్యారెక్టర్లలో కనిపిస్తున్నా.. పూర్తి నిడివి ఉన్న పాత్రల్లో నటించిందేం లేదు.
రామ్‌చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఓ చక్కని పాత్రలో నటించినా అతడి పోర్షన్ అంతా ఎడిటింగ్‌లో కట్ అయిపోయింది. దాంతో అతడికి రావాల్సిన పేరు వాయిదా పడిపోయింది. అయితే ఇక వాయిదా పద్ధతిలో వచ్చినా నాగచైతన్య 'దోచెయ్' చిత్రంతో అతడికి మంచి పేరొస్తుందని ప్రచారమవుతోంది. చైతూతో ప్యారలల్‌గా తెరనిండుగా ఆద్యంతం అలరించే పాత్రలో వైవా హర్ష నటించాడు. ఈ పాత్రలో అద్భుతమైన హాస్యాన్ని పండించాడని యూనిట్ చెబుతోంది.
ఈ సినిమా తర్వాత అతడి ఫేట్ మారిపోతుంది. దోచెయ్ చిత్రాన్ని సుధీర్‌వర్మ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. వైవాహర్షని వెలుగులోకి తేవాలన్న సుధీర్‌వర్మ ఆలోచన సక్సెసైతే టాలీవుడ్‌కి మరో చక్కని హాస్యనటుడు దొరికినట్టే.