బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ హిందీ సినిమాలతో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'రక్త చరిత్ర' లాంటి తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈమధ్య మళ్ళీ సౌత్ సినిమాల్లో విలన్ పాత్రల్లో నటిస్తూ క్రేజ్ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా అజిత్ తమిళ సినిమా 'వివేగం'(తెలుగులో 'వివేకం') లో విలన్ రోల్ చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్-బోయపాటి శ్రీను సినిమాలో మెయిన్ విలన్ గా కనిపిస్తాడట. తాజాగా ఈ నటుడు 'దేవదాస్' టీమ్ కి పెద్ద షాక్ ఇచ్చాడట.
విషయంలోకి వెళ్తే.. అక్కినేని నాగార్జున - నాని కాంబినేషన్ లో 'దేవదాస్' అనే మల్టిస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం వివేక్ ను సంప్రదించారట నిర్మాతలు. వివేక్ రూ. 2.5 కోట్లు తనకు రెమ్యునరేషన్ గా ఇవ్వాలని అడిగాడట. దీంతో 'దేవదాస్' మేకర్స్ అవాక్కయ్యరట. ఎందుకు అని మీకు అనుమానం వచ్చిందా? చరణ్ - బోయపాటి సినిమాకు వివేక్ రూ. 1.25 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడట. అందుకే 'దేవదాస్' టీమ్ షాక్ అయ్యింది. మరి చరణ్ లాంటి పెద్ద స్టార్ సినిమాలో మెయిన్ విలన్ గా చేస్తే తన క్రేజ్ పెరుగుతుందని ముందే డిసైడ్ అయ్యి 'దేవదాస్' టీమ్ కి ఇలా షాక్ ఇచ్చాడేమో. అది క్రేజ్ పెరిగిన తర్వాత కదా వివేకూ.. ఇప్పుడే పెంచేస్తే ఎలా?
మరి ఈయన ఎక్కువ చెప్పాడు కదా. అందుకనే 'దేవదాస్' టీమ్ వివేక్ కు బదులుగా మరో పవర్ ఫుల్ విలన్ కోసం వెతుకులాట మొదలెట్టారట. మరి కింగ్ నాగ్ ను - న్యాచురల్ స్టార్ నాని ఇద్దరినీ ఒకేసారి ఎదుర్కోవాలంటే కాస్త ఇంట్రెస్టింగ్ విలన్ కావాలి కదా.