చరణ్ విలన్ వింత వేషాలు

Update: 2019-03-18 06:16 GMT
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతకు ముందే ఫస్ట్ లుక్ విడుదల చేశారు కానీ టైటిల్ రోల్ పోషిస్తున్న వివేక్ ఒబెరాయ్ లుక్ నమ్మలేని రీతిలో ఉండటంతో కొన్ని అనుమానాలు తలెత్తాయి. వాటికి చెక్ పెడుతూ తాజాగా ఇందులో వివేక్ ఎన్ని రకాల గెటప్స్ లో కనిపిస్తాడో బయట పెడుతూ ఫ్రెష్ గా అప్ డేట్స్ వదిలింది టీమ్.

వివేక్ ఒబెరాయ్ మనకు సుపరిచుతుడే. సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయ రామలో మెయిన్ విలన్ గా రక్త చరిత్రలో పరిటాల రవీంద్రగా మెప్పించిన వివేక్ ఇందులో మోడీగా మల్టీ టాలెంట్స్ చూపించి నట్టు ఉన్నాడు. వచ్చే నెల 12న విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతున్న ఈ బయోపిక్ ఎన్నికల కారణంగా అంతకన్నా ముందుగా రాలేకపోతోంది

షూటింగ్ అతి తక్కువ టైం కేవలం రెండు నెలలోపే పూర్తి చేస్తున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం  వహిస్తున్న ఈ మూవీలో మనోజ్ జోషి అమిత షా పాత్రలో నటిస్తున్నాడు. బోమన్ ఇరానీది మరో కీలక పాత్ర. విడుదలకు ఇంకో నెల మాత్రమే టైం ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేశారు.

ఇందులో నరేంద్ర మోడీ యవ్వన దశ నుంచి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్థగా మారడం బిజెపిలో చేరడం ప్రధాన మంత్రిగా ఎదిగిన తీరు మొత్తం కవర్ చేస్తున్నారు. భారతీయ భాషలు అన్నింటిలోకి విడుదల కానున్న ఈ బయోపిక్ పూర్తిగా మోడీని ఉన్నత స్థాయిలో చూపడమే లక్ష్యంగా తీస్తున్నారు. బిజెపి అండదండలతోనే ఇది తీస్తున్నారని ఇప్పటికే బాలీవుడ్ లో టాక్ ఉంది. వివేక్ గెటప్స్ చూస్తూనే ఏదో చేసినట్టే కనిపిస్తున్నాడు


Tags:    

Similar News