#154 లో ఎవ‌రీ వైజాగ్ రంగ‌రావు!

Update: 2022-10-14 07:49 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న 154వ చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'లో మాస్ రాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి  తెలిసిందే. వీర‌య్య‌కి స‌వ‌తి  సొద‌రుడి పాత్ర‌లో మాస్ రాజా పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. చిరంజీవి పాత్ర‌కి పూర్తి కాంట్రాస్ట్ గా నెగిటివ్ రోల్ గా ఈ పాత్ర‌ని తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆద్యంతం రెండు పాత్ర‌ల మ‌ధ్య అస్స‌లు సొస‌గ‌ద‌ని...కీల‌కమైన ఎమోష‌న్ ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య పండుతుంద‌ని ఇప్ప‌టికే ప్ర చారం ఠారెత్తిపోతుంది. ఈ విష‌యాన్ని ఇంకా యూనిట్ ధృవీక‌రించ‌లేదు గానీ...ర‌వితేజ పాత్ర స్వ‌భావం అలాగే ఉంటుంద‌ని నెట్టింట ప్రచారం మాత్రం పీక్స్ లో జ‌రుగుతోంది. తాజాగా ఆ పాత్ర‌కి సంబంధించి మ‌రో అప్ డేట్  వైర‌ల్ అవుతోంది.

ర‌వితేజ వైజాగ్ రంగారావు అనే పాత్ర‌తో క‌నిపించనున్నారుట‌. అది ఔటెండ్ ఔట్ మాస్ పోలీస్ పాత్ర అని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తుంది. దీంతో మాస్ రాజా పాత్ర‌పై డైల‌మా మొద‌లైంది. ర‌వితేజ చిరంజీవి స‌వ‌తి సోద‌రుడి పాత్ర‌లో న‌టిస్తున్నారా?  ఆపాత్ర పేర‌దా?  లేక వైజాగ్ రంగారావు అనేది కొత్త పాత్ర‌? అన్న‌ది  సందేహం మారింది.

యూనిట్ సైతం ఇంత‌వ‌ర‌కూ ర‌వితేజే పాత్ర‌పై అధికారిక స్ప‌ష్ట‌త ఇచ్చింది లేదు.  ఈనేప‌థ్యంలో మేక‌ర్స్ క్లారిటీ ఇస్తే త‌ప్ప ర‌వితేజ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా?  వీర‌య్య‌కి సోద‌రుడిగా రంగారావు పాజిటివ్ గా క‌నిపిస్తాడా? అన్న‌ది  తేల‌డం క‌ష్టం . ఇక వ్య‌క్తి గ‌తంగా చిరంజీవిపై ర‌వితేజ అభిమానం అసాధార‌ణ‌మైన‌ది. అన్న‌య్య‌ని స్ఫూర్తిగా తీసుకునే ర‌వితేజ‌ తెరంగేట్రం చేసాడు.

అన్న‌య్య అంత‌టి వాడిగా ప‌రిశ్ర‌మ‌లో ఎదిగాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎద‌గ‌డం వెనుక చిరంజీవిలానే ఎంతో కృషి ఉంది. అందుకే చిరంజీవి త‌ర్వాత స్వ‌యం కృపరాధంతో ఎదిగిన‌ న‌టుడిగా ర‌వితేజ‌ని ఎక్కువ‌గా చెప్పుకుంటాం.

ర‌వితేజ స్ఫూర్తితో న‌టులుగా ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. మ‌రి అలాంటి న‌టుడ్ని  చిరంజీవి సినిమాలో నెగిటివ్ రోల్ లో చూపించ‌డంపై ఆస‌క్తి సంత‌రించుకుంది. గ‌తంలో  చిరంజీవి హీరోగా న‌టించిన ఓ  సినిమాలో ర‌వితేజ‌ పాజిటివ్ రోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి వాల్తేరు వీర‌య్య లో ఎలాంటి రంగార‌వుని చూపిస్తారో? ప్ర‌స్తుతం  సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News