మంచు విష్ణు హీరోగా జీ.ఎస్.కార్తీక్ రెడ్డి తెరకెక్కిస్తున్న `ఓటర్` వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. హీరో విష్ణుకి.. దర్శకుడికి మధ్య విభేధాలు ఇటీవల రచ్చకెక్కడంపై సర్వత్రా పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఈ గొడవ చినికి చినికి గాలి వాన అవుతోంది. దర్శకుడు కార్తీక్ రెడ్డి తాజాగా రివీల్ చేసిన ఓ వీడియో మరోసారి పరిశ్రమలో జోరుగా చర్చకు తావిచ్చింది. ఓటర్ సినిమా కోసం అసెంబ్లీ రౌడీ కథ.. స్క్రీన్ ప్లే రాసినందుకు కోటిన్నర ఇస్తానని ఒప్పుకున్నట్లు మంచు విష్ణు చెబుతున్న విషయం లో వాస్తవం లేదని.. అసలు ఓటర్ సినిమాకు కధ.. స్క్రీన్ ప్లే .. డైరెక్షన్ చేస్తే నాకు వచ్చింది 20 లక్షలే అని ఆ వీడియోలో దర్శకుడు పేర్కొన్నారు. కోర్టుల పరిధిలోనూ ఆయన పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనితో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. అసలింతకీ ఓటర్ విషయంలో ఏం జరుగుతోంది అన్న చర్చ వేడెక్కిస్తోంది
``ఎంత మోసం? నాకు రెమ్యునరేషన్ వచ్చేదే 20 లక్షలు. కథ.. కథనం.. దర్శకత్వం చేస్తే ఇచ్చేది అంత. ఇరవై లక్షల దర్శకుడిని.. కోటిన్నర పెట్టి `అసెంబ్లీ రౌడీ` రైట్స్ కొని సినిమాని తీస్తానా? బాహుబలి హక్కులకే కోటిన్నర ఉండదు. నేను ఎన్ని కోట్లు పెట్టి కొనగలను. ఎంత మోసం ఇది? ఒక హీరో చేసే పనేనా? కాదు.. పొరపాటున మోసం చేశావని రివర్సయ్యాను కాబట్టి అతడు నన్ను ఏమైనా చేయొచ్చు. నన్ను ఏం చేసినా .. నేను కనిపించకుండా పోయినా .. ఏం చేసినా అందుకు మంచు విష్ణునే కారణం...ఇది గుర్తుంచుకోండి. ఇది హీరో చేసే పనే కాదు. ఒక దర్శకుడిగా నిర్మాతకు నష్టం కలగకూడదని భావించి సినిమా రిలీజవ్వాలని భావించి ఈ చిత్రానికి సంతకం చేశాను. అసలు ఓటర్ కి అసెంబ్లీ రౌడీకి సంబంధమే లేదు. అయినా ఎందుకు సైన్ చేశానంటే.. నేను ఇంత త్యాగం చేస్తున్నాను కాబట్టి సినిమాని ఎమోషనల్ గా భావించి రిలీజ్ చేస్తారని ఫీలయ్యాను. కానీ నన్నే మోసం చేసి నాపైనే కేసు పెట్టి ప్రొడ్యూసర్లను టార్చర్ పెడుతున్నారంటే ఇది ఒక హీరో చేయాల్సిన పనేనా? ఒక సినిమాకి హీరో వెన్ను దన్నుగా ఉండి రిలీజ్ చేసుకోవాల్సింది పోయి.. డబ్బులకు కక్కుర్తి పడి సినిమాని ఆపుకున్న హీరో ప్రపంచంలో వేరొకరు ఉండరు. పొరపాటున నేను యాంటీ అయినందుకు .. ఇది మోసం అని అన్నందుకు ఏం చేసినా అందుకు కారణం హీరోనే. నాకు డేంజర్ మంచు విష్ణు వల్లనే.. ప్లీజ్ .. ఇది గుర్తుంచుకోండి.. `` అంటూ వీడియో సాక్షిగా దర్శకుడు జి.ఎస్.కార్తీక్ రెడ్డి భయాన్ని వ్యక్తం చేయడం చర్చకు వచ్చింది.
అసలు ఓటర్ కి అసెంబ్లీ రౌడీకి సంబంధమే లేదు. నేను ఇంత చేస్తున్నా.. నన్నే మోసం చేసి .. నాపైనే కేసు పెట్టి టార్చర్ చేస్తున్నారని .. అది హీరో చేయాల్సిన పని కాదని కార్తీక్ మీడియాకెక్కారు. అయితే ఈ గొడవను సామరస్యంగా పరిష్కరించుకోకుండా మరీ పెద్దది చేస్తున్నారా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి గొడవల్ని పరిష్కరించేందుకు ఫిలింఛాంబర్ కానీ.. నిర్మాతల మండలి కానీ చొరవ చూపించడం లేదా? ఎందుకిలా వీడియోలతో రచ్చకెక్కుతున్నారు? అసలేం జరుగుతోంది? అంటూ ఇరువర్గాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఆ ఇద్దరి మధ్యా వివాదం పరిష్కరించే నాధుడే లేడా? అన్న ముచ్చటా సాగుతోంది. మంచు విష్ణు స్నేహితుడు ఓటర్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
Full View