మహేష్‌ స్పెషల్‌.. ఆయన చేస్తే బాగుంటుంది!

Update: 2018-11-18 12:59 GMT
మొన్నటి వరకు బాలీవుడ్‌ కే పరిమితం బయోపిక్‌ లు ప్రస్తుతం టాలీవుడ్‌ రాజ్యం ఏలేందుకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే వచ్చిన మహానటి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తెలుగు బాక్సాఫీస్‌ ముందు ఇంకా పలు బయోపిక్‌ లు క్యూ కట్టబోతున్నాయి. ఇలాంటి సమయంలోనే  ప్రముఖ క్రికెటర్‌ వి వి ఎస్‌ లక్ష్మణ్‌ తన బయోపిక్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు క్రీడావర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే లక్ష్మణ్‌ బయోపిక్‌ వస్తుందేమో అనే నమ్మక కలుగుతోంది.

సచిన్‌ - ధోని వంటి స్టార్స్‌ బయోపిక్‌ లు వచ్చిన సమయంలోనే అంటే రెండేళ్ల క్రితం లక్ష్మణ్‌ బయోపిక్‌ కోసం కూడా ఆయనతో సంప్రదింపులు జరిపారట. కాని ఆసమయంలో తాను ఆసక్తి చూపలేదని, అప్పుడు నా జీవితంలోని విషయాలను చెప్పలేదని అన్నాడు. కాని ఇప్పుడు తన జీవిత చరిత్రను తానే ఒక బుక్‌ రూపంలో తీసుకు వస్తున్నట్లుగా ప్రకటించాడు. త్వరలోనే ఆ బుక్‌ ను రివీల్‌ చేస్తానని కూడా పేర్కొన్నాడు. ఆ బుక్‌ ఆధారంగా సినిమా తీసేందుకు ఆయన ఆసక్తిగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. టాలీవుడ్‌ హీరోల్లో తనకు మహేష్‌ బాబు అంటే చాలా ఆసక్తి అని - అందుకే ఆయన తన బయోపిక్‌ లో నటిస్తే చూడాలనేది తన అభిమతం అంటూ లక్ష్మన్‌ పేర్కొన్నాడు.

మహేష్‌ బాబు ఇలాంటి సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడు. కాని వెరి వెరి స్పెషల్‌ లక్ష్మణ్‌ తనకు మహేష్‌ స్పెషల్‌ అంటూ చెప్పడంతో పాటు - తన బయోపిక్‌ మహేష్‌ చేస్తే బాగుంటుందని చెప్పడం వల్ల మహేష్‌ ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి.
    

Tags:    

Similar News