టీవీ నటి తునీషా శర్మ అనుమానాస్పద మరణం కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతున్నాయి. ఆన్ లొకేషన్ క్రైమ్ కథ రకరకాలుగా మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో తాజాగా మరో రెండు కోణాలు బయటపడ్డాయి. 20ఏళ్ల నటి తునీషా మరణానికి ముందు మాజీ ప్రియుడు షీజాన్ ఖాన్ తో తీవ్ర వాగ్వాదానికి దిగిందని వలీవ్ పోలీసులు వెల్లడించగా.. ఖాన్ డ్రగ్స్ తీసుకునేవారని కూడా నటి తల్లి వెల్లడించారు. ఇరువురి నడుమా వాదన జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రముఖ జాతీయ మీడియాకు తెలిపారు.
తునీషా డిసెంబర్ 24న తన టీవీ షో `అలీ బాబా దస్తాన్-ఈ-కాబుల్` సెట్స్ లో శవమై కనిపించింది. అటుపై షీజన్ ఖాన్ కుటుంబం బ్లాక్ మెయిల్ చేసిందని తునీషా తల్లి ఆరోపించారు. తునీషా మరణం అనంతరం మాజీ ప్రియుడు సహనటుడు అయిన షీజన్ ఖాన్ తన ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు.
బుధవారం షీజన్ ను వసాయ్ కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ అతనికి గ్రీన్ రూమ్ లో మరణించిన తునీషాకి మధ్య జరిగిన 15 నిమిషాల సంభాషణ డిసెంబర్ 24న ఆమె ఆత్మహత్యకు దారితీసిందని వాలీవ్ పోలీసులు కోర్టుకు తెలిపిన తర్వాత పోలీసులు కస్టడీని రెండు రోజులు పొడిగించారు. ఇప్పుడు కొత్త అప్ డేట్ ప్రకారం.. రిమాండ్ ముగిసినా కానీ షీజన్ ని శనివారం వరకు పోలీసుల కస్టడీలోకి పంపారు.
మరోవైపు కుటుంబ సభ్యులు తునీషా హత్యకు గురైందా? లేదా? అనే దానిపై దర్యాప్తు చేయాలని వలీవ్ పోలీసులను అభ్యర్థించారు. షీజన్ తల్లితో తునీషా సంభాషణ వివరాలను తెలుసుకోవడానికి దివంగత నటి తల్లి వనితా శర్మ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసారు. ``30 డిసెంబర్ స్టేట్ మెంట్ లను రికార్డ్ చేయడానికి షీజన్ ఖాన్ సోదరీమణులను అతడి తల్లిని పిలుస్తాము`` అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
తునీషా స్నేహితులు షీజన్ బంధువుల స్టేట్ మెంట్ లను రికార్డ్ చేయడంతో పాటు సెట్ లోని డివిఆర్ .. సిసిటివి రికార్డింగ్ లను సేకరించడంతో పాటు సీరియల్ `అలీ బాబా దాస్తాన్-ఇ-కాబుల్` ప్రొడక్షన్ మేనేజర్ ను కూడా పోలీసులు పిలిపించారు.
తునీషా - షీజాన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని వారాల క్రితం విడిపోయారని గతంలో కథనాలొచ్చాయి. తునీషా మరణానికి ముందు షీజన్ ఆమెను మోసం చేశాడని తునీషా తల్లి ఆరోపించింది. షీజన్ డ్రగ్స్ తీసుకునేవాడని ఇటీవల తునీషా ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని ఆమె ఆరోపించింది. ఇస్లాంను అనుసరించమని షీజన్ తనను బలవంతం చేశారని కూడా ఆమె ఆరోపించింది.
ఇదిలా ఉంటే షీజన్ సోదరి ఫలక్ నాజ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు త్వరలో సమాధానం ఇస్తామని చెప్పారు. తునీషా తల్లి చేసిన ఆరోపణలకు త్వరలో విలేకరుల సమావేశంలో సమాధానం ఇస్తాను. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మా సోదరుడిని కాపాడుకోవడం వరకే మా ప్రాధాన్యత! అని ఫలక్ పేర్కొన్నారు.
పాపులర్ టీవీ షోలో తునీషా షెహజాదీ మరియమ్ పాత్రను పోషించగా... షీజాన్ అలీ బాబాగా కనిపించాడు. ఇది SAB TVలో ప్రసారమైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.