2023 సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పోటీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సంక్రాంతి సమరం అనేది జరుగుతూనే వున్నా ఈ సంక్రాంతి మాత్రం చాలా స్పెషల్ గా మారింది. కారణం ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇద్దరు సీనియర్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరిలో నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ డ్రామా `వీర సింహారెడ్డి` జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` మూవీ `జనవరి 13న అంటే బాలయ్య సినిమా రిలీజ్ తరువాత ఒక్క రోజు ఆలస్యంగా విడుదలవుతోంది.
ఈ ఇద్దరు అగ్ర కథానాయకులకు సంబంధించిన రెండు భారీ సినిమాలు పోటీపడుతున్న నేపథ్యంలో ప్రమోసన్స్ పరంగానూ భారీ క్రేజ్ మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలని నిర్మిస్తున్నది ఒకే నిర్మాణ సంస్థ. అదే మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఇద్దరి సినిమా ప్రమోషన్స్ విషయంలో నువ్వా నేనా అనే పంథాలో కాకుండా ఇద్దరూ ఒకటే అనే స్థాయిలో మైత్రీ సంస్థ ఈ రెండు సినిమాల ప్రమోసన్స్ ని ప్లాన్ చేస్తోందట.
చిరంజీవి, బాలయ్యలు గత కొన్నేళ్లుగా మంచి ఫ్రెండ్స్. ఇదే వీరి సినిమాల మధ్య ఆరోగ్య కరమైన వాతావరనాన్ని క్రియేట్ చేస్తోందని చెబుతున్నారు. రెండు సినిమాలకు నిర్మాణ సంస్థలు వేరైతే అప్పుడు పోటీ ప్రచారం మరోలా వుండేదని, రెండు సినిమాలకు మైత్రీ సంస్థనే నిర్మించింది కాబట్టి ఎక్కడా ఎలాంటి పోటీ కానీ, హెచ్చు తగ్గులు కానీ లేకుండా రెండు సినిమాలకు సమాన ప్రాధాన్యత నిస్తూ ప్రమోసన్స్ ని మైత్రీ వారు ప్లాన్ చేస్తున్నారట.
బాలయ్య సినిమా పాట ని ఏ పంథాలో రిలీజ్ చేస్తున్నారో.. సేమ్ అదే పంథాలో చిరు సినిమా పాటలని రిలీజ్ చేస్తూ కూల్ గా ప్రమోషన్స్ కానిచ్చేస్తున్నారు. చిరు ఫ్యాన్స్ తో ప్రత్యేకంగా మీటింగ్ ని నిర్వహించిన మైత్రీ నిర్మాతలు అదే తరహాలో బాలయ్య ఫ్యాన్స్ తోనూ మీటింగ్ ని ఏర్పాటు చేయడం. ప్రమోషన్స్ గురించి వారి ఒపీనియన్ లని తీసుకోవడం తెలిసిందే. దీంతో ఇరు హీరోల సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూల్ గా సాగిపోతోందని చెబుతున్నారు. మైత్రీవారి ప్లానింగ్ చూసిన ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నారట.
మామూలుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే టైమ్ లో రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఏ హీరో విషయంలో అయినా కాస్త పట్టు తప్పారని తెలిస్తే అభిమానులు ఓ రేంజ్ లో మేకర్స్ తో గొడవకు దిగుతుంటారు. కానీ బాలయ్య `వీరసింహారెడ్డి`, చిరంజీవి `వాల్తేరు వీరయ్య` ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీగా వున్నారని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.