2 మిలియన్ క్లబ్ లో వీరయ్య

Update: 2023-01-19 04:27 GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య బాక్సాఫీసు వద్ద భారీ సంచలనం చేస్తోంది. రోజురోజుకూ జోష్ పెంచుకుంటూ పరుగులు పెడ్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా బాక్సాఫీసును కొల్లగొడ్తోంది. తాజాగా 2 మిలియన్ డాలర్ ప్లస్ క్లబ్ లోకి చేరి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ వారంలో 3 మిలియన్ డాలర్ల ప్లస్ లోకి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించింది. బాజీ దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య..  ఈనెల 13వ తేదీన విడుదలైన తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తోంది. మెగాస్టార్ నుంచి అభిమానులు ఏం కోరుకున్నారో అవన్నీ ఈ సినిమాలతో ఉండడంతో ప్రజలంతా చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1545 స్క్రీన్స్ లో విడుదల అయింది.

అందుకు ఏమాత్రం తగ్గకుండా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ కురిపిస్తూనే ఉంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లను కొల్లగొట్టింది. ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 83.53 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ భారత్ రూ.5.65 కోట్లు, ఓవర్సీస్ లో రూ.10.20 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ.53.53 కోట్ల వసూళ్లను రాబట్టింది. అంతే కాదండోయ్ 89 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను కూడా సాధించింది.

వాల్తేరు వీరయ్య జోరు చూస్తుంటే... బాక్సాఫీసును పూర్తిగా బద్ధలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే 29.30 కోట్ల షేక్, రెండో రోజు 14.60 కోట్ల షేర్, మూడో రోజు 15.01 కోట్ల షేర్, నాలుగో రోజు 14.77 కోట్ల షేర్, ఐదో రోజు 9.85 కోట్ల షేర్ ను రాబట్టింది. చిరంజీవి కెరియర్ లోనే అత్యంత వేగంగా వంద కోట్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసిందీ వాల్తేరు వీరయ్య.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News