ఒకేరోజు మూడు భారీ చిత్రాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి తెలుగు చిత్రం సైరా నరసింహారెడ్డి.. మరొకటి బాలీవుడ్ చిత్రం వార్.. వేరొకటి హాలీవుడ్ చిత్రం జోకర్.. ఒక్కో భాష నుంచి ఒక్కో చిత్రం.. ఈ మూడు చిత్రాలు ఎంతో క్రేజుతో రిలీజైనవే. ఈ మూడింటిపైనా పాజిటివ్ టాక్ వచ్చిందని ట్రేడ్ చెబుతోంది.
ఇండియాలో సైరా.. వార్ చిత్రాలపై ముందే భారీ అంచనాలున్నాయి. తొలి రోజు రికార్డులు సహా తొలి వీకెండ్ వసూళ్లపైనా ట్రేడ్ పండితులు భారీ అంచనాల్ని వెలువరించారు. ఓ అంచనా ప్రకారం.. ఈ మూడు సినిమాలు కలిపి దేశవ్యాప్తంగా 150-200కోట్ల మేర గ్రాస్ వసూలు చేసి ఉంటాయని అంచనా వేస్తోంది ట్రేడ్. సైరా తొలి రోజు వసూళ్లు అన్ని భాషలు కలుపుకుని సుమారు 50కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయినా అడ్వాన్సు బుకింగ్ ల రూపంలోనే భారీగా వసూలు చేశాయి. పైగా పాజిటివ్ టాక్ ఉండడంతో వసూళ్ల పరంగా తగ్గవని ప్రముఖ క్రిటిక్ రమేష్ బాలా విశ్లేషించారు.
నేడు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ డే .. గాంధీ జయంతి సెలవు దినం ఈ సినిమాలకు దేశీయంగా మంచి వసూళ్లకు ప్లస్ అవుతుందని క్రిటిక్ రమేష్ బాలా అంచనా వెలువరించారు. హృతిక్ - టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే 30కోట్లు వసూలు చేసిందని రమేష్ బాలా వెల్లడించారు. ఈ చిత్రం ఓపెనింగ్ డే 70శాతం బుకింగ్స్ జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తెలిస్తే ఈ సంఖ్య పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి-అమితాబ్ సహా అన్ని భాషల స్టార్లు నటించడం వల్ల ఈ చిత్రానికి డే వన్ వసూళ్లు భారీగా దక్కి ఉంటాయని రమేష్ బాలా తెలిపారు. ఇక హాలీవుడ్ చిత్రం జోకర్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. సమీక్షలు పాజిటివ్ గా వచ్చాయి. అందువల్ల భారీగానే వసూలు చేసి ఉంటుందని అంచనాను వెల్లడించారు. మౌత్ టాక్ తో జోకర్ కూడా వసూళ్లను పెంచుకుంటుందని విశ్లేషిస్తున్నారు.