పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి అన్ని పరిశ్రమల్లో చర్చ సాగుతోంది. పాన్ ఇండియా స్టార్లు అంటే తెలుగు సినిమా హీరోలేనన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో స్టారాధి స్టార్లు సైతం మన స్టార్ల సత్తా చూసి నోరెళ్లబెడుతున్నారు. 500 కోట్లు కాదు ఏకంగా 1000 కోట్లు తెచ్చే సత్తా తెలుగు స్టార్లకు మాత్రమే ఉందనేది ఎవరికీ డైజెస్ట్ కావడం లేదు. 1000 కోట్ల క్లబ్ లో మనకు ముగ్గురు స్టార్లున్నారు.
ప్రభాస్ - రామ్ చరణ్ - తారక్ ఇప్పటికే నిరూపించారు. బన్ని పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేస్ లోకి వచ్చినా 1000 కోట్ల క్లబ్ ని అందుకోలేదు ఇంకా. అయితే పుష్ప సీక్వెల్ తో ఆ రేంజులో హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు.
ప్రస్తుతం పుష్ప 2 కోసం సన్నాహకాల్లో ఉన్నాడు. ఈ సినిమా స్క్రిప్టు కోసం సుకుమార్ చాలా సమయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్ట్ 1 ఘనవిజయం సాధించాక.. పుష్ప 2 కాన్వాస్ అమాంతం మారింది. యాక్షన్ పదింతలైంది.
పాన్ ఇండియా మార్కెట్లో దుమ్ము దులిపేయాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించనున్నారు. అయితే స్క్రిప్టు కోసమే ఇంత సమయం తీసుకోవడంతో ఈ గ్యాప్ లో బన్ని ఒక చిన్న సినిమా చేయాలనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన స్క్రిప్టు దొరికితే తక్కువ సమయంలో పరిమిత బడ్జెట్లో ఓ సినిమా చేయాలనేది బన్ని ప్లాన్ అని తెలిసింది.
పుష్ప చిత్రం ఆలస్యంగా మొదలవుతోంది కాబట్టి డిసెంబర్ 2023లో మాత్రమే విడుదలవుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే బన్ని ఈలోగానే వేరొక చిన్న సినిమాలో నటించే వీలుందిట. ఓవైపు దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ చేయాల్సి ఉన్నా కానీ దానిపై బన్ని ఆసక్తిని కనబరచడం లేదు.
ఆ మూవీ ప్రస్తుతానికి పెండింగ్ లోనే ఉండిపోయింది. ఇక లోబడ్జెట్ మూవీ స్క్రిప్టు దర్శకుడు ఓకే అయితే బన్నీ టీమ్ ప్రకటించే వీలుందని కూడా టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ డమ్ గురించి ముచ్చటిస్తున్న వేళ ఇప్పుడిలా చిన్న సినిమా చేయడం సరైనదేనా? పుష్పరాజ్ నిర్ణయం కరెక్టేనా? అన్నది కూడా చర్చకు వస్తోంది.