వీరయ్య..బాలయ్య ఒక్క రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' జనవరి 13 న రిలీజ్ అవుతుంటే? ఆ ముందు రోజు జనవరి 12 నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 'వీరసింహారెడ్డి' రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ర్టాల్లో ఈ రెండు సినిమాల మధ్య పోటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా? అన్నరేంజ్ లో పోటీ పడతాయి.
వీటితో పాటు 'వారసుడు'....'తెగింపు' లాంటి చిత్రాలు పోటీ రేసులో ఉన్నాయి. మరోవైపు తాజాగా బాలీవుడ్ నుంచి 'కుత్తే'.. 'లకడ్ బగ్గా' చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవి రెండు జనవరి 13న రిలీజ్ అవుతున్నాయి. ఇవి పాన్ ఇండియా టార్గెట్ గా రిలీజ్ అవుతున్నాయి. వీళ్లెవ్వరికి బాలయ్య..చిరంజీవి పోటీ కాదు. వాళ్ల టార్గెట్ కేవలం తెలుగు రాష్ర్టాలు మాత్రమే.
ఇక్కడ వసూళ్లే ఆ రెండు సినిమాల లక్ష్యం. మరి పాన్ ఇండియాలో వీళ్లిద్దరు ఎందుకు పోటీ పడటం లేదంటే? కంటెంట్ పరంగా అవి పూర్తిగా కమర్శియల్చిత్రాలు. తెలుగు ప్రేక్షకుల్ని..నేటివిటీని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రాలు. చిరంజీవి... బాలయ్యలకు పాన్ ఇండియా వైడ్ పెద్దగా కూడా మార్కెట్ లేదు. దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లో మినహా నార్త్ లో పెద్దగా రిలీజ్ కావు.
పాన్ ఇండియా కంటెంట్ అయితే మేకర్స్ ఆ రకమైన రిలీజ్ ప్రయత్నాలు చేసే వారు. అయితే మెగాస్టార్ గత సినిమా 'సైరా నరసింహారెడ్డి' అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది. కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత చిరంజీవి ఆ తరహా ప్రయత్నాలు చేయలేదు.
ఇక బాలయ్య అయితే పాన్ ఇండియా గురించి ఆలోచన కూడా చేయలేదు. తన అన్ స్టాపబుల్ షోకి వచ్చిన అతిధుల్నిమాత్రం పాన్ ఇండియా సినిమాలపై అభిప్రాయాలు మాత్రం సేకరిస్తుంటారు. అయినా చిరు..బాలయ్య లకి పాన్ ఇండియా అవసరమే లేదు. ఆ హీరోలిద్దరి సినిమాలు ఇక్కడే కోట్ల కనక వర్షం కురిపిస్తుంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.