మెగా హీరో వరుణ్ తేజ్ 'ఎఫ్ 2' చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకుని ఈ సంవత్సరంను సక్సెస్ తో స్టార్ట్ చేశాడు. అంతకు ముందు కూడా మంచి సక్సెస్ లను దక్కించుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ జిగర్తాండకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కెరీర్ లో మొదటి సారి నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
వరుణ్ తేజ్ తో పాటు ఈ చిత్రంలో అథర్వా హీరోగా కనిపించబోతున్నాడు. డీజే తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రంపై చాలా నమ్మకం పెట్టుకుని తెరకెక్కిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి జిగర్తాండ స్క్రిప్ట్ ను మార్చినట్లుగా సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణ రాయలసీమ జిల్లా అయిన అనంతపురంలో జరుగుతున్నట్లుగా దర్శకుడు హరీష్ శంకర్ పేర్కొన్నాడు.
ఈ షెడ్యూల్ లో కీలక పాత్రల్లో నటించే నటీనటులు పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన వరుణ్ తేజ్ ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా కూడా తప్పకుండా బాగుంటుందని.. వరుణ్ తేజ్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.