ఏడు పదుల వయసొచ్చినా సినిమాల విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతున్నారు. తన అభిమానులను, సినీ ప్రియులను అలరించేందుకు ఆయన అప్పుడు, ఇప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటి వ్యక్తితో సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ రగడకు సిద్ధమైంది. అయితే రియల్ గా కాదండోయ్.. రీల్ గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ తో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే.
సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. `తలైవర్ 169` వర్కింగ్ టైటిల్ తో ఆగస్టు తొలి వారం నుంచీ ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రంలో రజనీకాంత్ కు జోడీగా ఐశ్వర్యారాయ్ నటించబోతోందని.. కీలక పాత్రల్లో ప్రముఖ హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ కనిపించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో టాక్ తెరపై వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో రజనీకాంత్ ను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేశారట. ఇటీవలె మెకర్స్ రమ్యకృష్ణను కలిసి ఆమె పాత్రను వివరించారట. అది నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పిందని.. సినిమాలో రజనీ, రమ్యకృష్ణల మధ్య వార్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని నెట్టింట వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
కాగా, రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే మొదట గుర్తొచ్చే సినిమా ‘పడయప్ప(తెలుగులో నరసింహ)`. కె. ఎస్. రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజనీకాంత్, సౌందర్య జంటగా నటించారు. అలాగే నీలాంబరి అనే విలన్ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా పోషించింది.
ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. విమర్శకులు సైతం అప్పట్లో రమ్యకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడీ కాంబో మరోసారి రిపీట్ కానుందని టాక్ నడుస్తుండటంతో.. తెరపై రజనీ-రమ్యకృష్ణల మధ్య వార్ చూడాలని అభిమానులు తెగ మచ్చటపడుతున్నారు.