మొదటి నుంచి కూడా నాని తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగుతో ఉంటాడు. ఏడాదికి మూడు సినిమాలు తన నుంచి థియేటర్లకు వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాదిలో తన సినిమాను అనుకున్న సమయానికి ఆయన థియేటర్లకు తీసుకురాలేకపోయాడు .. అదీ థియేటర్లు మూసి ఉండటం వలన. అంతే తప్ప ఆయన తప్పు ముమ్మాటికీ లేదు. ఈ ఏడాది ఆయన చేస్తున్న మూడు సినిమాల్లో మొదటిదైన 'టక్ జగదీశ్' ఉత్సాహంతో విడుదలకి సిద్ధమైంది. కానీ అప్పటికే కరోనా విజృంభణ మొదలైపోవటంతో వాయిదా పడింది.
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'టక్ జగదీశ్' .. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల చుట్టూ తిరుగుతుంది. జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తూ ఉండటంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలో అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. థియేటర్లు తెరుచుకున్న తరువాత సందడి చేయడానికి లైన్లో ఉన్న సినిమాల జాబితాలో 'టక్ జగదీశ్' కూడా ఉన్నాడు. ఆ తరువాత సినిమాగా నాని 'శ్యామ్ సింగ రాయ్' చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న 'శ్యామ్ సింగ రాయ్'లో నాని లుక్ డిఫరెంట్ గా ఉంది. అంతేకాదు కథా నేపథ్యం కూడా వైవిధ్యంగా ఉండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కనిపించనున్నారు. ఈ ముగ్గురు కథానాయికలతో నాని రొమాన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత నాని నుంచి రానున్న మరో సినిమానే 'అంటే .. సుందరానికీ'.
ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. 'బ్రోచేవారెవరురా' వంటి నాన్ స్టాప్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కావడంతో ఈ సినిమా మంచి బజ్ ఉంది. పైగా టైటిల్ తోనే కొత్తదనాన్ని చూపించడంలో వివేక్ ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో నాని సరసన నాయికగా తెలుగు తెరకి 'నజ్రియా' పరిచయమవుతోంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగు మొదలైందని అన్నారు. షూటింగు నిమిత్తం నజ్రియా వచ్చిందనీ, కరోనా తీవ్రత పెరగడం వలన వెనక్కి వెళిపోయిందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత నుంచి అప్ డేట్స్ లేవు. సుందరానికి ఏమైందో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం అభిమానుల్లో పెరుగుతోంది. మరి మేకర్స్ నుంచి అప్ డేట్ ఏదైనా వస్తుందేమో చూడాలి.