టాప్ స్టోరి: ఈ `హీరో`ల‌కేమైంది?

Update: 2019-03-06 14:30 GMT
మీటూ ఉద్య‌మం పుణ్య‌మా అని `వేధింపులు` అన్న ప‌దం బాగా పాపుల‌రైపోయింది. ఇవి అలాంటి వేధింపులు కావు కానీ, ఇదో ర‌కం వేధింపులు అని ప్ర‌స్థావించాల్సి ఉంటుంది. మంచి ఔట్ పుట్ కోసం.. మంచి ప్రొడ‌క్ట్ కోసం చేసే హ‌రాష్‌ మెంట్ అన్న మాట‌! స‌రిగ్గి ఇక్క‌డే క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అన్న ప‌దం గ‌మ్మ‌త్తుగా పుట్టుకొస్తోంది. ద‌ర్శ‌కుడు ఎంత చెప్పినా ఆ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం అన్న‌ది క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కి తావిస్తోంది. ఇటీవ‌లి కాలంలో మ‌న హీరోల‌కు - స్టార్ డైరెక్ట‌ర్ల‌తోనే బోలెడ‌న్ని క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌డం చూస్తున్నాం. క‌థ రాసేసినా, బౌండ్ స్క్రిప్టు కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేసి ఇక పూర్త‌యిపోయింది సెట్స్ కెళ్ల‌డ‌మే త‌రువాయి! అనుకుంటుండ‌గానే ఊహించ‌ని ట్విస్టులు.

స‌రిగ్గా ఇదే త‌ర‌హా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ - సుకుమార్ జోడీ ఫేస్ చేశారు. అలాగే అల్లు అర్జున్ - 24 ఫేం విక్ర‌మ్ .కె.కుమార్ జోడీ ఎదుర్కొన్నారు. ఏడాది పైగా స‌ద‌రు హీరోల కోసం స్క్రిప్టు ప‌నులు చేసిన ఆ స్టార్ డైరెక్ట‌ర్లు చివ‌రికి ప్రాజెక్టును ఒప్పించ‌లేక వెనుదిరిగారు. ఎంత రీవ‌ర్క్ చేసినా హీరోల్ని మెప్పించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. దీంతో అంత‌కాలం ప‌ని చేసినా ఆ ప్రాజెక్టుల్ని స్టార్ హీరోలు ప‌క్క‌న పెట్టేసారు. ఆస‌క్తిక‌రంగా మ‌హేష్ ని ఒప్పించ‌లేక‌పోయిన సుకుమార్ ఆ వెంట‌నే బ‌న్నికి క‌థ చెప్పి ఒప్పించేయ‌డం ఓ బిగ్ ట్విస్ట్. ఇక‌పోతే విక్ర‌మ్.కె.కుమార్ అంత‌కాలం బ‌న్ని కోసం క‌థ‌పై వ‌ర్క్ చేసి చివ‌రికి ఓకే చేయించ‌లేక‌పోయాడు. ఆ క్ర‌మంలోనే అత‌డు నేచుర‌ల్ స్టార్ నానితో వేరొక ప్రాజెక్టుకు క‌మిటై సెట్స్ కెళ్లిపోయాడు. అయితే విక్ర‌మ్ కాస్త ప్ర‌యోగాత్మ‌క‌త‌తో ఉంటాడు. ఫిక్ష‌న్ కి ద‌గ్గ‌ర‌గా ఆలోచిస్తాడు. అందువ‌ల్ల క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట‌వ్వ‌ద‌న్న భ‌యం బ‌న్నిని వెంటాడింద‌ని చెప్పుకున్నారు. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కుడినే బ‌న్ని ఆర్నెళ్లు పైగానే క‌థ కోసం రీవ‌ర్క్ చేయిస్తూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక సుకుమార్ విష‌యంలో మ‌హేష్ ఎందుకు విభేధించారు? అన్న పాయింట్ తెలియాల్సి ఉంది. `సోగ్గాడే చిన్నినాయ‌నా` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన క‌ళ్యాణ్ కృష్ణ సైతం రెండేళ్లు పైగానే స్క్రిప్ట్ వ‌ర్క్ చేసినా ఇంకా `బంగార్రాజు` సెట్స్ కెళ్ల‌లేదు. కింగ్ నాగార్జున ఆ క‌థను ఓకే చెప్పేందుకు చాలా కాల‌మే వెయిట్ చేయించారు. ఇండ‌స్ట్రీలో ఇలాంటి స‌న్నివేశాలెన్నో.

క‌థ ఒప్పుకోవాలంటే ద‌ర్శ‌కుల‌కు టార్చ‌రే.. అని ర‌క‌ర‌కాల‌ ఇన్సిడెంట్లు చెబుతున్నాయి. ఇక మెగా కాంపౌండ్ లో ఏ క‌థ ఓకే చేయాల‌న్నా అంత సులువేం కాదు. దిల్ రాజు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ లో, డి సురేష్ బాబు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనూ బోలెడ‌న్ని ఆరాలు తీస్తారు. క‌థపై రీవ‌ర్క్ చేయిస్తారు. ఇక స్టార్ హీరోలే కాదు, యువ హీరోలు సైతం ఇటీవ‌ల క‌థ‌ల్ని గుడ్డిగా ఒప్పేసుకోవ‌డం లేదు.  బౌండ్ స్క్రిప్ట్ కావాలి. తెచ్చాక దానిపై తిరిగి సందేహాలు తీర్చాలి. మ‌ళ్లీ రీవ‌ర్క్ చేయాలి.. హీరోల ఇన్ పుట్స్ త‌ప్ప‌నిస‌రి. దాంతో పాటు పెద్ద హీరో అయితే ఇమేజ్ కు త‌గ్గ‌ట్టు మార్చాలి... ఇన్ని తంటాలు ఉంటాయి. స్క్రిప్టు వంద శాతం ఓకే అనిపించ‌క పోతే ఎన్నాళ్లు ప‌ని చేసినా ఇంకా ప‌ని చేయిస్తూనే ఉంటారు. అంతా శ్ర‌మించాక చ‌వ‌రిలో సుకుమార్, విక్ర‌మ్.కె అనుభ‌వం ఎదుర‌వ్వ‌క త‌ప్ప‌దు కొన్నిసార్లు. ఇండ‌స్ట్రీ అంటేనే పెషెన్స్ టెస్ట్ అన్న‌మాట‌! బ‌న్ని, మ‌హేష్ స‌హా మెగా హీరోలు ఇంకా ఇంకా ఎక్కువ‌గా ఇలానే రంధ్రాన్వేష‌ణ చేయిస్తుంటారు. చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేయిస్తున్నారు. ఆషామాషీగా స్క్రిప్టును ఓకే చెప్ప‌డం లేదు.
Tags:    

Similar News