స్టార్ హీరోగా, బహుబాషా నటుడిగా, జాతీయ స్థాయిలో మంచి పేరుతో పాటు అవార్డుల్ని సొంతం చేసుకున్న చియాన్ విక్రమ్ శుక్రవారం మధ్యాహ్నం గుండె పోటుకు గురయ్యారని, దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనని చెన్నైలోని కావేరి హాస్పటల్ లో చేర్పించారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
విక్రమ్ ని పరిశీలించిన డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని, ఫ్యాన్స్ భయపడాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లబడించాయని, అయితే ఐసీయూలో విక్రమ్ కు కావేరి హాస్పిటల్ డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని తమిళ మీడియా పేర్కొంది.
అంతే కాకుండా ఐసీయూలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విక్రమ్ ఆరోగ్యం నిలకడగా వుందని, భయపడాల్సిన పనిలేదని డాక్టర్లు చెబుతున్నారని, గుండెకు సంబంధించిన ట్యూబ్ లు బ్లాక్ అయ్యాయని కూడా కోలీవుడ్ మీడియా స్పష్టం చేసింది. దీంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా పాకిపోయింది. అభిమాన నటుడు విక్రమ్ కు ఏం జరిగింది? ఆయన ఎలా వున్నారని అభిమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తల్లో వున్న నిజం ఎంత. ఇంతకీ చియాన్ విక్రమ్ కు అసలు ఏమైంది? .. హార్ట్ ఎటాక్ కారణంగానే ఆయన హాస్పిటల్ లో చేరారా? .. లేక మరేదైనా కారణంతో హాస్పిల్ కు వచ్చారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా వుంటే విక్రమ్ కు హార్ట్ ఎటాక్ అన్న వార్తలని ఖండిస్తూ విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణ సోషల్ మీడియా వేదికగా విక్రమ్ హెల్త్ కి సంబంధించిన బులెటిన్ ని షేర్ చేశారు. కావేరి హాస్పిటల్స్‌కి చెందిన డా. అరవిందన్ సెల్వరాజ్ పేరుతో హెల్త్ బులెటిన్ ప్రస్తుతం నెట్టంట వైరల్ గా మారింది.
చాతిలో నొప్పి కారణంగా విక్రమ్ హాస్పిటల్ కు వచ్చారు. నిపుణులైన డాక్టర్లతో ఆయనకు వైద్యం అందించాం. ఆయనకు ఎలాంటి హార్ట్ ఎటాక్ రాలేదు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగానే వుంది. త్వరలోనే ఆయనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం` అని విక్రమ్ మేనేజర్ షేర్ చేసిన హెల్త్ బులెటిన్ లో డా. అరవిందన్ సెల్వరాజ్ స్పష్టం చేశారు. దీంతో విక్రమ్ ఆరోగ్యం పై వచ్చిన వార్తలన్నీ వట్టి వదంతులే అని తేలిపోయింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.