భాయ్ సల్మాన్ ని పాము కరిచింది.. ఇంతకీ ఆ పాముకి ఏమైంది? చాలా మంది నెటిజనుల సందేహమిది. అయితే ఇలాంటి సందేహం రావడానికి కారణం భాయ్ ఐరన్ మ్యాన్ ధృఢత్వం కలిగిన వాడవ్వడమేననడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదృష్టవశాత్తూ కరిచిన పాము విషం లేనిది. అది తాచు పాము కానేకాదు.. పొడపాము.. కట్టపాము అసలే కాదు. అందుకే ఇప్పుడు సల్మాన్ భాయ్ సేఫ్. అయితే గియితే ఆ పాముకే ఏదైనా అయ్యుండాలి. దీనిపై భాయ్ కూడా అంతే జోవియల్ గా స్పందిస్తున్నారు.
పాముపై సల్మాన్ స్టేట్ మెంట్ చూస్తుంటే ఆయనలో ఫన్ ఎంతో అర్థమవుతోంది. ``నన్ను ఆ పాము కరిచింది.. ఆస్పత్రి నుంచి వచ్చేప్పుడు ఆ పాము కనిపించింది. దాంతో ఫోటో దిగాను`` అన్నారు సల్మాన్ భాయ్.
ఇంతకీ ఈ పాము ఎక్కడ కరిచింది? అంటే.. ముంబై ఔటర్ లోని పన్వేల్ సమీపంలోని తన ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి విషం లేని పాము కాటుకు గురయ్యారు సల్మాన్ ఖాన్. ``ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉంది. వేగంగా కోలుకుంటున్నాడ``ని తనకి చికిత్స చేస్తున్న డాక్టర్ తెలిపారు.
56 ఏళ్ల సల్మాన్ కి చికిత్స చేసిన డాక్టర్ కుల్దీప్ సల్గోత్రా మాట్లాడుతూ- ``రెండు వైద్యుల బృందాలు సల్మాన్ ఖాన్ తో ఉన్నాయని ..అతని ఆరోగ్యం బాగానే ఉంది`` అని చెప్పారు. విషం లేని పాము కాటువేయడంతో ప్రమాదం లేదు. వెంటనే నవీ ముంబైలోని కమోతే ఆసుపత్రికి తీసుకెళ్లి ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేశామని తెలిపారు.
ఆదివారం రాత్రి నటుడు తన పన్వెల్ ఫామ్‌హౌస్ లో ఫోటో కూడా దిగారు. మీడియా అతనిని అనుసరించింది. అక్కడ అతను తన కుటుంబ సభ్యులతో కలిసి తన 56వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. ఇంతలోనే పాము కరిచి ట్విస్టిచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా తన ఫామ్‌హౌస్ వెలుపల గుమిగూడిన కెమెరామెన్లతో భాయ్ టెన్షన్ అన్నదే లేకుండా మాట్లాడారు.