శ్రీరెడ్డి ఎపిసోడ్ వర్మ ఎంట్రీతో తన రూపునే మార్చుకుంది. నిన్న వర్మ స్వయంగా పెట్టిన వీడియో వైరల్ కావడంతో పవన్ ఫాన్స్ తో పాటు వర్మ అభిమానులు కూడా గరంగరంగా ఉన్నారు. తాను చెప్పడం వల్లే శ్రీరెడ్డి పవన్ మీద నోరు జారిందని చెప్పిన వర్మ సురేష్ బాబు ని కూడా అడ్రెస్ చేయటం ఇప్పుడు మరో చర్చకు దారి తీస్తోంది. దీని ప్రకారం వర్మ సురేష్ బాబు తో మాట్లాడాడట. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒకవేళ నా కొడుకు తప్పు చేసుంటే శిక్ష అనుభవించాలని లేకపోతే నిర్దోషిగా బయటికి రావడం కన్నా కావాల్సిందని ఏముంటుందని సురేష్ బాబు చెప్పినట్టు వర్మ అంటున్నాడు. తాను వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అయ్యే సమస్యే లేదని చెప్పిన సురేష్ బాబు ఇది కోర్ట్ బాధ్యత అని తేల్చి చెప్పేసి అక్కడితో వదిలేయమన్నాడట.
ఇది వర్మతో నిజంగా సురేష్ బాబు అన్నారో లేదో ఆధారాలు అయితే ఏమి లేవు. కాని సురేష్ బాబు ఆ మాట చెప్పి ఉంటే నిజమైన పెద్దరికాన్ని ప్రదర్శించినట్టే. శ్రీరెడ్డి కౌంటర్ వేస్తూ తీవ్ర వ్యాఖ్యలు ఏమి చేయకుండా తప్పు ఉంటె శిక్ష లేదంటే సంతోషం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. సురేష్ బాబు స్పందన నిజంగా ఆహ్వానించదగ్గదే. అసలు ఈ పరిణామాలు ఎక్కడికి వెళ్తున్నాయో ఇండస్ట్రీ పెద్దలకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి శ్రీరెడ్డి కాని వర్మ కాని నెగటివ్ కామెంట్స్ చేయటం లేదు కాని ట్వీట్ రూపంలో ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉన్నారు. నేను నిజాన్నే చెప్పాను అని వర్మ పదే పదే నొక్కి చెబుతున్నా. మరోవైపు సోషల్ మీడియాలో వర్మ మీద ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్ళ తన ప్రవర్తనకు భిన్నంగా తనే వెనకుండి మరీ పవన్ ని తిట్టించాను అని చెప్పటం పట్ల మెగా ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది. కాని వర్మతో చెప్పినట్టు కాకుండా సురేష్ బాబు నేరుగా స్పందిస్తే అప్పుడు చెప్పింది నమ్మొచ్చు.