ప్రిన్స్ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

Update: 2022-10-20 15:30 GMT
వరుసగా డాక్టర్, డాన్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న యువ హీరో శివకార్తికేయన్ ఇప్పుడు మొదటిసారి ద్విభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కిన ప్రిన్స్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కేవలం తెలుగు తమిళంలోనే కాకుండా ఓటీటీ ద్వారా ఈ సినిమాను వివిధ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఏ స్థాయిలో జరిగింది అనే వివరాల్లోకి వెళితే. దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్ - ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక సినిమాకు బిజినెస్ అయితే డిమాండ్ కు తగ్గట్టుగా జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు దర్శకుడు అనుదీప్ జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించాడు.

ఇక అతనికి తోడుగా శివకార్తికేయన్ ఇంతకుముందే తమిళంలో భారీ స్థాయిలో విజయాలు అందుకున్నాడు. ఇక ఈ సినిమాకు ఆ రూట్లోనే మంచి డిమాండ్ అయితే పెరిగింది. ఇక ఈ సినిమా తమిళనాడులో దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.50 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. చాలా వరకు ఏరియాల్లో ఏషియన్ సినిమాస్ ఈ సినిమాను సొంతంగా విడుదల చేస్తోంది.

ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమాకు డీసెంట్ డిమాండ్ అయితే పెరిగింది. దీంతో అక్కడ 2.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్. ఇక కేరళ రాష్ట్రంలో 1.50 కోట్లు ధర పలికిన ఈ సినిమా మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా దాదాపు 1 కోటి వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా ఓవర్సీస్ లో చూసుకుంటే ప్రిన్స్ సినిమా 6.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు టాక్.

ఇక ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా ఈ సినిమా దాదాపు 51 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 52 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ మరోసారి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని హ్యాట్రిక్ అందుకుంటాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News