#RRR పై కరోనా ప్రభావం ఎంత?

Update: 2020-03-18 04:20 GMT
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా గడగడలాడిస్తోంది. ఇండియాలో చాలా స్పీడ్‌ గా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కారణంగా జనజీవనం స్థంభించి పోయింది. ఇప్పటికే భారత్‌ బంద్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నింటి పై కరోనా ప్రభావం స్పష్టం గా కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి వేల కోట్ల నష్టంగా విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాల షూటింగ్‌ విడుదల వాయిదా.. షూటింగ్స్‌ కు అంతరాయం.. థియేటర్లు మూసివేత తో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

కరోనా ప్రభావం ఇంతగా ఉన్న ఈ సమయం లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ పరిస్థితి ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా అటుగా చూస్తున్నారు. ప్రస్తుతానికి షూటింగ్‌ నిర్విరామం గా జరుగుతున్నా కూడా షూటింగ్‌ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. షూటింగ్‌ కనుక బ్రేక్‌ వేస్తే విడుదల తేదీ విషయంలో మళ్లీ మార్పు తప్పదేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే షూటింగ్‌ నెల రోజులు ఆలస్యం అయినా కూడా విడుదల తేదీ విషయంలో మాత్రం పెద్దగా ప్రభావం ఉండదు.

కాని కరోనా ప్రభావం నెలలకు నెలలు అంటే జూన్‌ జులై వరకు ఇలాగే ఉంటే మాత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్త విడుదల తేదీకి వెళ్లాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 80 శాతంకు పైగా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. కనుక షూటింగ్‌ పూర్తి చేయడానికి జక్కన్నకు ఎక్కువ నెలలు ఏమీ పట్టవు. కాని షూటింగ్‌ మే లో అయినా సజావుగా సాగితే విడుదల తేదీని మార్చే అవసరం రాక పోవచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి జక్కన్న ప్లాన్‌ బి ఏమైనా వేస్తున్నాడా లేదంటే ముందుగా అనుకున్న ప్రకారం ముందుకు సాగుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News