ఉస్తాద్‌ సినిమా రిలీజ్ కి అక్క‌డ‌ స‌మ‌స్య ఏంటీ?

Update: 2022-07-13 14:41 GMT
ఎన‌ర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ త‌న న‌టించిన `రెడ్‌` ఆశించిన ప‌లితాన్ని అందించక‌పోవ‌డంతో ఎలాగైనా ఈ సారి భారీ హిట్ ని సొంతం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లో వున్నాడు. ఇందు కోసం యాక్ష‌న్ క‌థ‌ని ఎంచుకుని లింగు స్వామితో `ది వారియ‌ర్` మూవీకి శ్రీకారం చుట్టాడు.

ఇదే మూవీతో తెలుగుతో పాటు త‌మిళంలోనూ మంచి గుర్తింపుతో పాటు మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకోవాల‌ని ప్లాన్ చేశాడు. అందుకే `ది వారియ‌ర్` మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ద్వి భాషా చిత్రంగా చేశాడు.  

ఫ‌స్ట్ లుక్ నుంచి సినిమా పై హైప్ క్రియేట్ అవుతూ వ‌చ్చింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, బుల్లెట్ సాంగ్, దేవి అందించిన పెప్పి నంబ‌ర్స్, ఆది పినిశెట్టి విల‌న్ గా న‌టించిన తీరు, ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రామ్ పాత్ర‌ని డిజైన్ చేసిన విధానం సినిమాపై అంచ‌నాల‌ని పెంచేశాయి. ట్రేడ్ వ‌ర్గాల్లోనూ మంచి బ‌జ్ క్రియేట్ అయింది. మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌బోతున్నాయి. జూలై 14న రెండు భాష‌ల్లో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు.

ప్ర‌స్తుతం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో నెల‌కొన్న వారావర‌ణ‌ ప‌రిస్థితులు మాత్రం ఈ సినిమాకు ప్ర‌తికూలంగా వున్నాయి. జోరుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అన్న‌ది ఇప్ప‌డు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అదే జ‌రిగితే ఈ మూవీ ఓపెనింగ్స్ పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే అవ‌కాశం వుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. దీనికి తోడు ఈ మూవీకి మ‌రో స‌మ‌స్య వెంటాడుతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఏక కాలంలో ఈ మూవీని మేక‌ర్స్ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. కానీ త‌మిళ వెర్ష‌న్ రిలీజ్ కు స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ట్టుగా చెబుతున్నారు. ఈ స‌మ‌స్య‌కు కార‌ణం ద‌ర్శ‌కుడు లింగుస్వామి అని తెలుస్తోంది. ఈ సిఇమాకు ముందు ఆయ‌న నిర్మించి తెర‌కెక్కించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఫ్లాపులుగా నిలిచాయి. వాటికి సంబంధించిన న‌ష్టాల‌ని ఇంత వ‌ర‌కు ఆయ‌న రిక‌వ‌రీ చేయ‌లేదంట‌. ఇప్ప‌డు ఇదే `ది వారియ‌ర్‌` త‌మిళ రిలీజ్ కు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని చెబుతున్నారు.  

దీనిపై దృష్టి పెట్టిన లింగుస్వామి స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అదే కాకుండా ఉభ‌య రాష్ట్రాల్లో జోరుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజ‌న‌కంగా లేవని తెలుస్తోంది. దీంతో భారీ ఓపెనింగ్స్ ని `ది వారియ‌ర్‌` రాబ‌ట్ట‌డం క‌ష్ట‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఏం జ‌ర‌గ‌నుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News