'థాంక్యూ' టీమ్ అంతా అక్క‌డ ఏం చేస్తున్న‌ట్లు?

Update: 2022-04-25 13:30 GMT
నాగ‌చైన‌త్య‌-రాశీఖ‌న్నా జంట‌గా విక్ర‌మ్ . కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థాంక్యూ` చిత్రం  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.  చిత్రీక‌ర‌ణ కూడా ముగించుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంత‌కు మంచి సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఎప్పుడు పూర్త‌వుతాయా?  సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌ది క్లారిటీ లేదు.ల ఇప్ట‌ప‌లో అయితే రిలీజ్ ఉండ‌ద‌ని ఇట‌వ‌లే మీడియ క‌థ‌నాలు హీటెక్కించాయి.

కొన్ని పెద్ద సినిమాల ఉండ‌టం స‌హా చిన్నా చిత‌కాహీరోలు జూన్ వ‌ర‌కూ డేట్ల‌ని లాక్ చేసుకోవ‌డంతో ఆ త‌ర్వాతే థాంక్యూ రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఆగ‌స్టు..సెప్టెంబ‌ర్ వ‌చ్చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. సినిమాకి సంబంధించి నాగ‌చైత‌న్య‌కి చెందిన ఒక్క పోస్ట‌ర్ త‌ప్ప ఇంకెలాంటి వివ‌రాలు ఇప్ప‌టివ‌ర‌కూ మేక‌ర్స్ అధికారికంగా రివీల్ చేయ‌లేదు. అయితే తాజాగా టీమ్ అంద‌రూ క‌లిసి ఉన్న ఓ ఫోటో లీకైంది.

ఇందులో నాగ‌చైత‌న్య ఫుల్ హ్యాండ్స్  టీష‌ర్ట్- జీన్స్ ప్యాంట్  ధ‌రించి సోపై కూర్చున్నాడు. చైత‌న్య సీరియ‌స్ గా త‌న ఫోన్ చూసుకుంటున్నాడు. ఆ ప‌క్క‌నే రాశీఖ‌న్నా చైర్ లో కుర్చుంది. ఇక సోఫాలో దర్శ‌కుడు విక్ర‌మ్. కె కుమార్ తో పాటు మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు కూడా కూర్చున్నారు. ఎదురుగా టీవీ ఉంది. టీమ్ అంతా ఇలా జ‌మ అయి సినిమా గురించి డిస్క‌స్ చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది.

అంతా ఇలా ప్ర‌శాంతంగా కూర్చున్నారు. అంటే నిర్మాణానంత‌ర ప‌నులు గ‌ట్రా పూర్త‌యి రిలాక్స్ అవుతున్నారా? అన్న  సందేహం వ‌స్తుంది. మ‌రి ఆ సిట్టింగ్ వెనుక సీక్రెట్ ఏంటి? అన్న‌ది యూనిట్ స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రు బ‌య‌ట‌పెడితే గాని క్లారిటీ రాదు. ఇక‌ నాగ చైత‌న్య స‌క్సెస్ ల‌తో ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి  తెలిసిందే.

`ల‌వ్ స్టోరీ`..`బంగార్రాజు`తో బ్యాక్ టూ బ్యాక్ విజ‌యాలు ఖాతాలో వేసుకున్నాడు. థాంక్యూపైనా భారీ అంచ‌నాలున్నాయి. గ‌తంలో విక్ర‌మ్ తో చైత‌న్య  `మ‌నం` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అదే ద‌ర్శ‌కుడు అఖిల్ తో `హ‌లో` సినిమా కూడా తెర‌కెక్కించారు.
Tags:    

Similar News