తెలుగులో మణికర్ణిక వస్తే పరిస్థితి ఏంటీ?

Update: 2018-12-12 12:24 GMT
బాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక’ చిత్రం 2019 రిపబ్లిక్‌ డే కు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. హిందీలో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మొదట భావించినప్పటికి విడుదల దగ్గర పడుతున్న సమయంలో ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో డబ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హిందీ వర్షన్‌ విడుదల అయితే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. కాని తెలుగులో విడుదలైతే మాత్రం ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

రిపబ్లిక్‌ డే సందర్బంగా ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ చిత్రం కూడా వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్‌ కథనాయకుడు వచ్చిన రెండు వారాల్లోనే ఎన్టీఆర్‌ మహానాయకుడిని ఖరారు చేశారు. ఎన్టీఆర్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న క్రిష్‌ బాలీవుడ్‌ లో మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహించి మద్యలో వదిలేసి వచ్చిన విషయం తెల్సిందే. మిగిలిన బ్యాలన్స్‌ వర్క్‌ ను కంగనా పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసింది. క్రిష్‌ పై పోటీకా లేదంటే మరేంటో కాని రిపబ్లిక్‌ డే కు తెలుగులో కూడా మణికర్ణికను విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ చిత్రానికి భారీ పోటీ ఉంది. ఇలాంటి సమయంలో మణికర్ణిక కూడా బరిలోకి దిగితే ఎన్టీఆర్‌ కు పోటీ మరీ పెరిగి పోతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంత పోటీని ఎన్టీఆర్‌ మహానాయకుడు తట్టుకోగలడా అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పెద్ద సినిమాలు ఉన్న కారణంగా ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రాన్ని వాయిదా వేసి ఫిబ్రవరిలో విడుదల చేసే ఆలోచనలో కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారంటూ కొందరు అంచనా చెప్పుకుంటున్నారు. మొత్తానికి మణికర్ణిక తెలుగు వర్షన్‌ వస్తే ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ విషయం ఏంటా అనేది ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. క్రిష్‌ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News