హిట్టు కొట్టాక వెంటనే ఫ్లాప్ అందుకుంటేనే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అయితే వరుసగా ఐదారు ఫ్లాపులుంటే ఇక అంతే సంగతి. ఇప్పుడు కుర్ర హీరో రాజ్ తరుణ్ పరిస్థితి అలాగే ఉంది. కెరీర్ ఆరంభంలో వరుసగా ఓ నాలుగు సూపర్ హిట్స్ అందుకున్న ఈ హీరోకి ఆ తర్వాత ఒకటి తర్వాత మరొకటి వరుస ఫ్లాపులు పకరించాయి. 'అందగాడు','రాజు గాడు' ఇలా రాజ్ తరుణ్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
గతేడాది 'లవర్' సినిమాతో కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అందుకున్న రాజ్ తరుణ్ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే 'ఇద్దరి లోకం ఒకటే' చేసాడు. ఈ సినిమా అయినా కుర్ర హీరోకి లిగ్ట్ ఇస్తుందనుకుంటే ఉన్న కాస్త మార్కెట్ ని ఇంకా డౌన్ చేసేసింది. ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా మీద కూడా పడింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాల్సిన సినిమా కూడా క్యాన్సెల్ అయ్యేలా ఉండనే టాక్ వినిపిస్తుంది.
మరి ఇప్పటికైనా కుర్ర హీరో కళ్ళు తెరిచి తను ఎలా ఎంటర్టైన్ చేయాలనే ఆలోచనలో పడి మంచి కథలతో పాటు సక్సెస్ ఇచ్చే దర్శకులను వెతుక్కుంటే బాగుంటుంది. లేదంటే కెరీర్ ను ఇలాగే అన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగించాల్సి వస్తుంది.