మహేష్ బాబు.. కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ క్రేజీ మూవీ సర్కారు వారి పాట సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే దుబాయిలో పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలను గురించి చూపించబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గీత గోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇదే అవ్వడం తో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.
కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతున్నా కూడా ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమా లో కీలక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ పోషించబోతున్నట్లుగా ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని యూనిట్ సభ్యుల వారు కూడా అంటున్నారు. ఆ పాత్ర ను సీనియర్ నటుడితో చేయించడం వల్ల తప్పకుండా మంచి హైప్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్ కు తగ్గ సీనియర్ స్టార్ ను ఎంపిక చేయాలనే ఉద్దేశ్యంతో మొదట యాక్షన్ కింగ్ అర్జున్ ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు మరో పేరు మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది.
సర్కారు వారి పాట సినిమా లో తమిళ నటుడు సముద్ర ఖనిని ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. అర్జున్ కొన్ని కారణాల వల్ల నో చెప్పారని దాంతో సముద్ర ఖనిని ఈ పాత్ర కోసం ఎంపిక చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. సర్కారు వారి పాట సినిమాలో నటించేది సముద్ర ఖనినా లేదా యాక్షన్ కింగ్ అర్జున్ నా అనే విషయాన్ని మేకర్స్ క్లారిటీ ఇస్తే కాని ఈ పుకార్లకు చెక్ పడే పరిస్థితి కనిపించడం లేదు.
ఇటీవల కాలంలో తెలుగు లో సముద్ర ఖని వరుసగా సినిమా లు చేస్తున్నాడు. అల వైకుంఠ పురంలో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు క్రాక్ సినిమాలో కూడా నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా లో కూడా ఈయన నటిస్తున్న విషయం తెల్సిందే. విలక్షణ నటుడిగా దర్శకుడిగా పేరు దక్కించుకున్న ఈయన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తే ఖచ్చితంగా సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మరి మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా సర్కారు వారి పాట సినిమాలో ఈయన నటిస్తున్నాడా లేదా అనేది కొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.
సముద్ర ఖని కాకుండా యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో నటించినా కూడా సినిమా కు భారీ బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అర్జున్ తెలుగు ప్రేక్షకులకు ఎన్నో సినిమాలతో సుపరిచితుడు. అందుకే ఆయన్ను సర్కారు వారి పాట సినిమాలో నటింపజేయాలని మేకర్స్ అనుకున్నారట. కాని ఆయన నో చెప్పాడని అంటున్నారు. మొత్తానికి సర్కారు వారి పాట సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరు నటించినా కూడా ఖచ్చితంగా సినీ అభిమానులకు మంచి వింధు భోజనం ఖాయం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.