కరోనా కారణంగా గత ఏడాది కొన్ని నెలల పాటు అన్ని రకాల షూటింగ్స్ దేశ వ్యాప్తంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. షూటింగ్ లు జరుగక దేశ వ్యాప్తంగా సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. మెల్లగా సీరియల్స్ ఆ తర్వాత సినిమాల షూటింగ్ లు మొదలు అయ్యాయి. గత ఏడాది చివరి వరకు జోరందుకున్నాయి. మళ్లీ పరిస్థితులు కుదుట పడ్డాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది. దేశ వ్యాప్తంగా ఈసారి లాక్ డౌన్ అమలు చేయడం లేదు కాని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆంక్షలు పెట్టింది. దాంతో మళ్లీ దేశ వ్యాప్తంగా షూటింగ్ లు జరగడం లేదు.
బాలీవుడ్ లో గత కొన్ని వారాలుగా షూటింగ్ లు సాగడం లేదు. ఎట్టకేలకు మహా ప్రభుత్వం నుండి షూటింగ్ లకు సంబంధించిన అనుమతి వచ్చింది. జూన్ 15వ తారీకు నుండి టీవీ మరియు సినిమా రంగానికి చెందిన షూటింగ్ లు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. షూటింగ్ లు బ్రేక్ పడటం తో సీరియల్స్ ఎపిసోడ్స్ నిలిచి పోయాయి.. వెబ్ సిరీస్ నుండి మొదలుకుని పెద్ద హీరోల సినిమాలు అన్ని కూడా నిలిచి పోయాయి. సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించిన నేపథ్యంలో మళ్లీ షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం జరిగింది.
దేశ వ్యాప్తంగా పరిస్థితులు కాస్త కుదుట పడుతున్న ఈ సమయంలో టాలీవుడ్ లో షూటింగ్ లకు ఎప్పటి నుండి అనుమతి వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఉదయం 6 నుండి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపు ఉన్నా కూడా ఆ సమయంలో షూటింగ్ కు వీలు పడటం లేదు. దాంతో లాక్ డౌన్ ఎత్తేసే వరకు షూటింగ్ లు నిలిపి వేయడం జరిగింది. మళ్లీ షూటింగ్ లు ఎప్పటికి ప్రారంభం అవుతాయా అంటూ సినీ కార్మికులు ఎదురు చూస్తున్నారు. జూన్ లో టాలీవుడ్ కెమెరా స్విచ్చాన్ అయ్యేనా అనేది చూడాలి.