తెలుగు ప్రేక్షకులకు గగనం మరియు మిస్టర్ నూకయ్య సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ సనా ఖాన్ పలు తమిళ మరియు హిందీ సినిమాల్లో నటించింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 6లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు దక్కించుకుంది. 2005 నుండి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ అమ్మడు ఈ ఏడాది వరకు నటిస్తూనే వచ్చింది. తెలుగు.. తమిళం.. హిందీ.. కన్నడం మరియు మలయాళ సినిమాల్లో కూడా నటించిన సనా ఖాన్ పలు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. ఇంకా అవకాశాలు వస్తున్నప్పటికి సినిమాలకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సంచలన నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
సోషల్ మీడియాలో ఇంగ్లీష్.. హిందీ మరియు ఉర్దు భాషల్లో తన సుదీర్ఘ లేఖను అభిమానుల ముందు ఉంచింది. ఆ లేఖలో అల్లా ఆదేశాల మేరకు ఇకపై నేను సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొంది. తన జీవితంలో అసలైన పరమార్థంను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఇన్నాళ్లు డబ్బు కోసమే సినిమాలు చేశాను. ఇక డబ్బు సంపాదనకు స్వస్థి చెప్పాలనుకుంటున్నాను. నా అవసరం ఉన్న వారికి నిస్వార్థంతో సేవ చేయాలని భావిస్తున్నాను. మరణం తర్వాత చక్కని జీవితాన్ని పొందాలి అంటే ఇప్పుడు మనం చేసే సేవా కార్యక్రమాలే దాన్ని నిర్థారిస్తాయి. అందుకే సేవా కార్యక్రమాలతో నా జీవితానికి మంచి ముగింపు ఇవ్వాలనుకుంటున్నట్లుగా వేదాంత దోరణిలో హాట్ బ్యూటీ తన లేఖలో పేర్కొంది.
సనా ఖాన్ సినిమాలకు గుడ్ బై చెప్పడంను చాలా మంది అభిమానులు స్వాగతించడం లేదు. ఆఫర్లు వస్తున్న ఈ సమయంలో సినిమాలను వదిలి పెట్టడం ఏంటీ అంటున్నారు. సినిమాల్లో నటిస్తూనే సమాజ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎందుకు అలా ప్రయత్నించరు అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం 15 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ మీరు సమాజం పట్ల బాధ్యతా యుతంగా ప్రవర్తించబోతున్నందుకు అభినందనలు అంటున్నారు.