వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్ సమయంలో తమన్నా కనిపించక పోవడంతో పలు పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే.
తమన్నాకు మరియు దర్శకుడు అనిల్ రావిపూడికి గొడవలు అయ్యాయి అంటూ చాలా బలంగా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించిన విషయం తెల్సిందే.
షూటింగ్ సమయంలో చిన్న చిన్న ఇష్యూలు ఉండటం కామన్ విషయం. తాను ఎప్పుడో ఆ విషయాన్ని మర్చి పోయాను అంటూ చెప్పుకొచ్చాడు. తాను మర్చి పోయాడు కాని తమన్నా ఇంకా మైండ్ లో ఉంచుకోవడం వల్లే ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున అనిల్ రావిపూడి ని ఆ విషయంలో ప్రశ్నలు గుప్పించారు. తమన్నా తో తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు అన్నట్లుగా అన్ని ఇంటర్వ్యూల్లో అనిల్ క్లారిటీ ఇచ్చాడు.
కేవలం తమన్నా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్ లో సంగీత దర్శకుడు కూడా ఎక్కువగా కనిపించలేదు. సరే ఆ సమయంలో ఆయన బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ లైట్ తీసుకున్నాడు. కాని తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్ లో భాగంగా యూనిట్ సభ్యులు దాదాపు అంతా కూడా హాజరు అయ్యారు.. కాని ఇక్కడ కూడా వారిద్దరు రాలేదు.
హీరోయిన్ తమన్నా తో పాటు దేవి శ్రీ ప్రసాద్ కూడా హాజరు అవ్వక పోవడం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడికి మరియు దేవి శ్రీ ప్రసాద్ కు కూడా మద్య ఏమైనా చెడిందా అంటూ టాక్ వినిపిస్తుంది. ఎఫ్ 2 నుండి మొదలుకుని వరుసగా మూడు సినిమా లను వీరిద్దరు కలిసి చేయడం జరిగింది. వర్క్ విషయంలో అనిల్ పదే పదే విసిగించడం వల్ల దేవి శ్రీ ప్రసాద్ కు కోపం వచ్చిందేమో అంటున్నారు.
తనకు కావాల్సింది.. తాను అనుకున్నది రావడం కోసం దర్శకుడు అనిల్ రావిపూడి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాడు. అదే సమయంలో టెక్నీషియన్స్ తో కూడా ఎప్పుడు పని చేయిస్తూనే ఉంటాడు. కనుక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో ఆ విషయంలో ఏమైనా చెడిందేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దేవి శ్రీ హాజరు కాక పోవడం పై యూనిట్ సభ్యులు స్పందించాల్సి ఉంది.