క్వీన్ ని చెప్పుతో కొట్టిందెవ‌రు?

Update: 2020-02-20 00:30 GMT
క్వీన్ కంగ‌న ర‌నౌత్ ని చెప్పుతో కొట్టారా? అయితే కొట్టింది ఎవ‌రు?  అస‌లింత‌కీ ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎందుకు హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది? అంటే .. ఈ వ్య‌వ‌హారంపై కంగ‌న సోద‌రి రంగోలినే అడ‌గాలి. రంగోలి ఇప్ప‌టికే త‌న సోద‌రి కంగ‌న శ‌త్రువుల్ని చీల్చి చెండాడుతున్న సంగ‌తి తెలిసిందే. నిరంత‌రం వేడెక్కించే వ్యాఖ్య‌ల‌తో ప‌లువురు ప్ర‌ముఖుల‌పై నిప్పులు చెరుగుతోంది రంగోలి.

తాజాగా బాలీవుడ్ లిరిసిస్ట్ జావెద్ అఖ్తర్ - ద‌ర్శ‌కుడు మహేష్ భట్ ల‌పై త‌న‌దైన శైలిలో ఫైరైంది. ఆ ఇరువురూ ప్ర‌ధాని మోదీని ఫాసిస్ట్! అని వ్యాఖ్యానించ‌డంపై రంగోలి తీవ్రంగానే విరుచుకుప‌డింది. ప్ర‌ధాని కాదు మీరు ఫాసిస్టులు. నా సోద‌రిపైకి చెప్పుతో దాడి చేశారు! అంటూ పాత విష‌యాల్ని కెలికింది రంగోలి.

హృతిక్ తో గొడ‌వ విష‌యంలో ప‌రిష్క‌రిస్తాన‌ని పిలిచి జావెద్ అక్త‌ర్ కంగ‌న‌పై చెప్పు విసిరార‌ని .. సీరియ‌స్ అయ్యార‌ని రంగోలి ఆరోపించింది. కంగ‌న‌చే క్ష‌మాప‌ణ చెప్పించాల‌ని ప్ర‌య‌త్నించార‌ని ఆ క్ర‌మంలోనే జావెద్ ప్ర‌వ‌ర్త‌న దారుణం అని విమ‌ర్శించింది. అలాగే ఓ రోజు నా సోదరి సూసైడ్ బాంబర్ పాత్రను పోషించడం ఇష్టం లేదని తిరస్కరించడంతో మహేష్ భట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట‌. ఓ దశలో నా సోదరిపైకి చెప్పును విసిరారని రంగోలి తెలిపింది. జావెద్ అఖ్తర్- మహేష్ భట్ ప్రధానిని ఫాసిస్ట్ అంటూ విమర్శించారు. చాచా (బాబాయ్) మీరిద్దరు అస‌లైన ఫాసిస్టులు అంటూ విరుచుకుప‌డింది. ఇక పుల్వామా దాడుల స‌మ‌యంలో జావెద్ భార్యామ‌ణి పాకిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డంపైనా కంగ‌న సోద‌రి రంగోలి భ‌గ్గుమ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానికి అండ‌గా నిలుస్తూ ఆ ఇద్ద‌రినీ అలా ఆడుకుంది రంగోలి.


Tags:    

Similar News