భారతీయ సినిమా చరిత్రలో చాలా ప్రత్యేకంగా నిలిచిపోయి బాలీవుడ్ మేకర్స్ ని సైతం నివ్వెరపరిచేలా రీజనల్ సినిమా సత్తా చాటిన బాహుబలి రెండు భాగాలు టీవీలో ఇప్పటికే పలుమార్లు వచ్చేసినా దానికుండే క్రేజ్ దానికి ఇప్పటికీ ఉంది. బాహుబలిలో హీరో ప్రభాస్ విలన్ రానాల తర్వాత అంతగా గుర్తుండిపోయే పాత్ర శివగామిదే. కానీ శివగామికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రెండు భాగాల్లో చూపించే అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఇది వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం ఆర్కా మీడియా నిర్మించే బాహుబలి ప్రీక్వెల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవ కట్టా ప్రవీణ్ సత్తారు సంయుక్తంగా దర్శకత్వం వహించడం ప్రధాన ఆకర్షణగా మారనుంది. రైజ్ అఫ్ శివగామి పుస్తకం ఆధారంగా రమ్యకృష్ణ పాత్ర ప్రస్థానం మహారాణిగా ఎదిగిన వైనం అన్ని అందులో వివరంగా చూపించబోతున్నారు.
కాకపోతే అందరికి వస్తున్న అనుమానం ఒకటే. శివగామిగా రమ్య కృష్ణ నటిస్తారా లేక ఇంకెవరైనా తీసుకొస్తారా అని. నెట్ ఫ్లిక్స్ బడ్జెట్ కు భయపడే రకం కాదు. ఇటీవలే హిందీ లో విడుదల చేసిన సెక్రెడ్ గేమ్స్ కోసం సైఫ్ అలీ ఖాన్ నవాజుద్దీన్ సిద్ధిక్ రాధికా ఆప్టే లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులను తీసుకుంది. 6 గంటల పాటు ఉండే ఆ వీడియోల కోసం సదరు తారలకు భారీగానే ముట్టజెప్పారట. రెండో సీజన్ షూటింగ్ కూడా జరుగుతోందని వినికిడి. సో శివగామి కోసం ఖర్చుకు వెనుకాడే సమస్య ఉండదు. అందులో ఆర్కా మీడియా నిర్మాణం కాబట్టి గ్రాండ్ నెస్ గురించి చింత అవసరం లేదు. కాబట్టి ఇమేజ్ ఉన్న తారలు వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది. బాహుబలికి ముందు జరిగిన కథగా ఈ ప్రీక్వెల్ మీద అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. 9 ఎపిసోడ్లు ఉండబోయే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీ నిడివి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. శివగామి కథ ఆధారంగా కాబట్టి రమ్యకృష్ణ అయితేనే త్వరగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరో వస్తారో వేచి చూడాలి.