చాలా వరకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు తమ సినిమా ల రిలీజ్ ల కోసం సెంటిమెంట్ డేట్ లతో పాటు హాలీడే సీజన్ లని కూడా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటూ ఆ సమయాల్లో తమ క్రేజీ మూవీస్ ని థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంటారు. మంచి వీకెండ్ లభించిందంటే వారికి పండగే. అలాంటి డేట్ కొసం ఎదురుచూసిన కొంత మంది ప్రొడ్యూసర్ లు ఆగస్టు నెలలో వచ్చే ఇండిపెండెన్స్ వీక్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు.
వరుసగా తమ క్రేజీ చిత్రాలని పోటీకి దింపారు. బాక్సాఫీస్ వద్ద సమరానికి ఐదుగురు హీరోలు సై అంటే సై అంటున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 11న హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. నాగచైతన్య కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తరువాత అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి.
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఇదే రోజున అక్షయ్ కుమార్ నటించిన `రక్షాబంధన్` కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఆగస్టు 12న నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `కార్తికేయ 2` రిలీజ్ కాబోతోంది. దర్శకుడు చందూ మొండేటికి, హీరో నిఖిల్ కు ఈ మూవీ అత్యంత కీలకంగా మారింది. అంతే కాకుండా నిఖిల్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం, 2014లో వచ్చిన `కార్తికేయ`కు ఈ మూవీ సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ట్రైలర్ తో మరింతగా ఆడియన్స్ లో ఈ మూవీపై పాజిటివ్ టాక్ మొదలైంది. ఇక ఇదే రోజున నితిన్ నటించిన `మాచర్ల నియోజక వర్గం` రిలీజ్ కాబోతోంది. వరుస ఫ్లాపుల్లో వున్న నితిన్ కు ఈ మూవీ కూడా కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్ లతో పాటు అంజలిపై చిత్రీకరించిన పాటతో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇక ఈ మూవీస్ తో పాటు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న `స్వాతిముత్యం` ఆగస్టు 13న రిలీజ్ అవుతోంది.
వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వం వహించారు. ఆగస్టు వీకెండ్ లో రెండు హిందీ సినిమాలు, మూడు తెలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. అయితే ఇందులో విన్నర్ గా నిలిచేది ఎవరన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.