దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ `సీతా రామం`. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని ట్యాగ్ లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు.
ఆగస్టు 5న భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించగా, ఇతర ప్రధాన పాత్రల్లో సుమంత్, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించారు.
ఫస్ట్ లుక్ నుంచి ఈ మూవీ ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. తాజాగా సోమవారం జూలై 24న ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మూవీ గురించి హీరోయిన్ రష్మిక మందన్న పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.
సినిమాలో అఫ్రీన్ క్యారెక్టర్ ని నాకు ఆఫర్ చేసినప్పుడు చాలా వండర్ ఫీలయ్యాను. చాలా వయలెంట్ క్యారెక్టర్ నాది. ఈ పాత్ర గురించి ముందు చెప్పినప్పుడు కాస్త భయపడ్డాను. నేను చేయలేనని చెప్పాను.
ఇంత వరకు నేను చాలా బబ్లీ, యాంగ్రీ బర్డ్ మాదిరిగా సాగే పాత్రల్లో నటించాను. కానీ ఇంత వయలెంట్ గా, రెబల్ గా వుండే పాత్రలో నటిస్తే ఆడియన్స్ అంగీకరిస్తారా? అనిపించింది. అందుకే ముందు చేయలేనని చెప్పాను. ఆ తరువాత దర్శకుడు ధైర్యం ఇవ్వడంతో మొత్తానికి చేశాను. నా పాత్రకు న్యాయం చేశాననుకుంటున్నాను.
ఇదొక అందమైన లవ్ స్టోరీ. దీన్ని చెప్పడానికి ఓ పాత్ర కావాలి. ఆ పాత్రలో నేను నటించాను. సీతారామం` మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాను. అంతే కాకుండా పాత్రలకు సరైన న్యాయం చేశామని నమ్ముతారని భావిస్తున్నాను.
యుద్ధంతో రాసిన ప్రేమకథగా సాగే ఈ సినిమాలోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది` అంటూ రష్మిక మందన్న పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ తో పాటు తెలుగులో వారసుడు, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తోంది.