నాన్ స్టాప్ స్పీడ్ ఆపేది 'ఎవరు'

Update: 2019-08-19 05:14 GMT
గ్యాప్ వచ్చినా సరే లెక్కచేయకుండా చాలా తెలివిగా స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ డైరెక్టర్స్ ఎంపికలోనూ విలక్షణత పాటిస్తున్న అడవి శేష్ లేటెస్ట్ రిలీజ్ ఎవరు ఓవర్సీస్ లో దూసుకుపోతోంది. వారం పూర్తయ్యేలోపు హాఫ్ మిలియన్ మార్క్ చేరుకోవడం సులభమని అక్కడి ట్రేడ్ రిపోర్ట్. మొత్తం వీక్ ఎండ్ కలిపి సుమారు 3 లక్షల 40 వేల డాలర్లకు పైగా వసూలు చేసిన ఎవరు టార్గెట్ ని రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదు. అందులోనూ స్ట్రాంగ్ అపోజిషన్ గా నిలిచిన రణరంగం అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఫలితంగా దాని వసూళ్ళు కేవలం 73 వేల డాలర్లకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. శర్వానంద్ కు ఇది ఒకరకంగా షాక్ అనే చెప్పాలి.

ఇక ఎవరు రీమేక్ అయినప్పటికి ఒరిజినల్ వెర్షన్ ఇన్విజిబుల్ గెస్ట్ తో పాటు హిందీ వెర్షన్ బదలాను అధిక శాతం చూసినప్పటికీ ఈ రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషమని చెప్పొచ్చు. ఫైనల్ రన్ పూర్తయ్యే లోపు బయ్యర్లను లాభాల్లోకి తీసుకెళ్లడం ఖాయమని తేలిపోయింది. అందులోనూ గత వారం వచ్చిన మన్మథుడు 2 డిజాస్టర్ గా నిలవడం రెండో వారానికే కంటిన్యూ చేయడం ఎగ్జిబిటర్లకు భారంగా మారడం లాంటివి కూడా ఎవరుకి చాలా ప్లస్ గా నిలుస్తున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అన్ని వర్గాలను టార్గెట్ చేసే అవకాశం లేనప్పటికీ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో అందులోనూ మల్టీ ప్లెక్సుల్లో ఎవరుకి మంచి ఆక్యుపెన్సీ దక్కింది. ఇవాళ నుంచి డ్రాప్ ఎంత శాతంలో ఉంటుందనే బట్టి ఎవరు నెక్స్ట్ రన్ డిసైడ్ అవుతుంది. ఎలాగూ 23న చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. సాహో వచ్చేదాకా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరు ఈ సానుకూలతను ఎంతమేరకు వాడుకుంటుంది అనే  దాన్ని బట్టి లెక్కల్లో మార్పులు ఉంటాయి. బిసి సెంటర్స్ లో మాత్రం ఎవరు ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోతోందనే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి.

    

Tags:    

Similar News