ఈ ఆగస్ట్ 15 రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాల మధ్య పోటీ ఆసక్తి రేపుతోంది. ఒకటి రణరంగం. రెండు ఎవరు. మార్కెట్ పరంగా హీరో ఇమేజ్ కోణంలో రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నా ఎవరికి వారు తమ కంటెంట్ మీద ధీమాగా ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక పోలిక విషయానికి వస్తే శర్వానంద్ రణరంగం అడవి శేష్ ఎవరు ట్రైలర్ కేవలం కొన్ని గంటల తేడాతో ఆన్ లైన్ లోకి వచ్చేశాయి. శర్వా సినిమా అవుట్ అండ్ అవుట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా క్లారిటీ వచ్చేసింది,
ఎవరు క్రైమ్ థ్రిల్లర్ అనే క్లూస్ ఇచ్చేశారు. జోనర్స్ ఏంటనేది తెలిసిపోయింది కాబట్టి కాన్సెప్ట్ పరంగా లింక్ అయితే లేదు. కాని ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. శర్వానంద్ సినిమా వచ్చి ఏడు నెలలు దాటేసింది. యూత్ లోనూ ఫామిలీస్ లోనూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న ఇతనికి ఫస్ట్ డే ఓపెనింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. పైగా ప్రస్థానం తర్వాత అంత హై వోల్టేజ్ సబ్జెక్ట్ శర్వా మళ్ళీ చేయలేకపోయాడు. దానికి మించి ఉంటుందనే తరహాలో దర్శకుడు సుధీర్ వర్మ రణరంగంను తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది కాబట్టి ఫస్ట్ డే కెరీర్ బెస్ట్ రికార్డు అయినా ఆశ్చర్యం లేదు.
దానికి తోడు కళ్యాణి ప్రియదర్శన్ - కాజల్ అగర్వాల్ గ్లామర్ ఫ్యాక్టర్ భారీ ఎత్తున జరిగిన నిర్మాణం అన్ని రకాలుగా రణరంగంకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కాని ఎవరుకి ఇవేవి లేవు. రెజినా పాత్ర చుట్టూ తిరిగే ఓ మర్డర్ మిస్టరీ తరహాలో ఇది ఉందన్న ఇంప్రెషన్ ట్రైలర్ తో వచ్చింది. ఆ ఒక్క కారణం జనాన్ని ధియేటర్ దాకా రప్పించడానికి సరిపోదు. అంతకు మించి ఏదో ఉందన్న ఫీలింగ్ సినిమా కలిగించాలి. అది మౌత్ టాక్ తోనే సాధ్యం. మెప్పించేలా ఉంటే ఓకే లేదంటే ఇబ్బందులు తప్పవు. సో నేషనల్ హాలిడేని ముందుగా క్యాష్ చేసుకునేది రణరంగమే. ప్రమోషన్స్ ని చాలా లేట్ గా స్టార్ట్ చేయడం కూడా ఎవరుకి కొంత ప్రతికూలంగా ఉంది