మొత్తానికి 'పెంగ్విన్' బిజినెస్ లెక్క ఇదేనట..!

Update: 2020-06-24 10:30 GMT
ప్రస్తుతం కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీలో పరిస్థితులన్ని తారుమారు చేసింది. థియేటర్లు మూతపడి జనాలను ఇంట్లో కట్టి పడేసింది. ఇదివరకు ఫస్ట్ డే.. వీకెండ్ కలెక్షన్లు అంటూ లెక్కలేసేవారు. కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా మునుపటిలా సినీ ప్రేక్షకుల హంగామా ఉండదు. ప్రస్తుతం ఓటిటిల హవా బాగా నడుస్తుంది. అందుకే దర్శక నిర్మాతలు ఓటిటిల వైపు మళ్లుతున్నారు. ఇటీవలే భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమా పెంగ్విన్. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. మహానటి సినిమా తరువాత కీర్తి చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమే మైనస్ అంటున్నారు.

అదే థియేటర్లలో అయితే కలెక్షన్స్ వేరేలా ఉండేవి. కానీ ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే తక్కువ బడ్జెట్. తక్కువ బడ్జెట్లో కేవలం కీర్తి తప్పు వేరే పెద్ద నటీనటులు ఎవరు లేరు. అంతేగాక లొకేషన్ల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన పనిలేకుండా ఒకే చోట షూటింగ్ పూర్తి చేశారు. అయితే మొత్తంగా ఈ సినిమాకి నాలుగు కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని సమాచారం. కీర్తి సురేష్‌కు ఉన్న క్రేజ్‌ను బట్టి అమేజాన్ ప్రైమ్ పెంగ్విన్ సినిమాను మంచి ధరకే కొనుక్కుంది. 7.5 కోట్ల‌కు అమేజాన్ సొంతం చేసుకుందట. ఆ తర్వాత వ్యూవ‌ర్ షిప్ బ‌ట్టి.. ఆ మిగిలిన ఆదాయాన్ని షేర్ చేయ‌డానికి అమేజాన్ ఒప్పుకుంద‌ట‌. ఇన్ని ల‌క్ష‌ల గంట‌ల‌కు ఇంత మొత్తం అని ముందే అమెజాన్ `పెంగ్విన్‌` నిర్మాత‌తో ఒప్పందం చేసుకుంద‌ట‌.

అయితే పెంగ్విన్ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని టాక్. ప్రథమార్ధం మెప్పించినా ద్వితీయార్థం.. క్లైమాక్స్ మైనస్‌గా నిలవడంతో పెంగ్విన్ యావరేజ్‌గా ఉందని అంటున్నారు. దీంతో విడుదలైన రెండు మూడు రోజులు మాత్రమే పెంగ్విన్ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఇక పెంగ్విన్ శాటిలైట్ హక్కులను ఓ టాప్ ఛానల్ మంచి రేటుకే సొంతం చేసుకుందట. అన్ని భాషలు కలిపి 6 కోట్ల రేంజ్‌లో డీల్ జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడు పోవాల్సి ఉందట. ఇక ఇప్పటివరకు 13.5కోట్లు బిజినెస్ జరగగా.. 4కోట్ల బడ్జెట్ కి 9కోట్ల పైనే లాభం దక్కినదని సమాచారం. హిందీ హక్కులు కూడా మంచి బిజినెస్ జరిగితే మొత్తంగా 10కోట్ల లాభం రానుందట.
Tags:    

Similar News